హ‌జ్ స‌బ్సిడీ వ‌ద్దంటున్న‌ అస‌దుద్దీన్‌

Update: 2017-01-13 08:48 GMT
మజ్లిస్ పార్టీ నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలనమైన ప్రకటన చేశారు. కేంద్రప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే ముస్లింల కోసం ఇచ్చే స‌బ్సిడీపై వ‌ద్ద‌ని అస‌ద్ ప్ర‌క‌టించారు. సాలీనా రూ.690 కోట్లను ఖర్చుపెడుతున్న తీరుపై
ఒవైసీ ఈ విషయమై ట్వీట్ చేశారు. కేంద్రం హజ్ యాత్రకు ఇచ్చే సబ్సిడీని రద్దు చేసి, ఆ నిధులు బాలికల విద్యకు ఖర్చుపెట్టాలని ట్వీట్ చేశారు. సౌదీ అరేబియా ఈ ఏడాది భారత్ నుంచి వచ్చే ముస్లిం యాత్రికుల సంఖ్యను 1.30 లక్షల నుంచి 1.70 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయాన్ని ఒవైసీ స్వాగతించారు.

అదే సమయంలో హజ్ యాత్రకు ఇచ్చే సబ్సిడీ రూ. 690 కోట్లను బాలికల విద్యకు ఖర్చు చేస్తే బాగుంటుందని కేంద్రానికి అస‌ద్ సూచన చేశారు. బాలిక‌ల విద్య ముస్లింల‌లో త‌క్కువ‌గా ఉంద‌ని పేర్కొన్న ఓవైసీ ఈ విష‌యంలో శ్ర‌ద్ధ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. అందుకోస‌మే హ‌జ్ నిధుల‌ను మ‌ళ్లించాల‌ని అస‌దుద్దీన్ కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News