తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధ్యక్షుడు - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దూకుడు పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న పార్టీ అభ్యర్థుల తరపున అసదుద్దీన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ముస్లింలు దేశానికి పట్టిన చెదలు అన్నట్లు బీజేపీ - ఆరెస్సెస్ వ్యవహరిస్తున్నాయని ఓవైసీ ఆరోపించారు. దేశానికి పట్టిన అసలు చెదలు బీజేపీ - ఆరెస్సెస్సేనని విమర్శించారు. నిరుద్యోగం గురించి తాను ప్రశ్నిస్తుంటే ఆరెస్సెస్ మాత్రం దేశంలో ఇద్దరు పిల్లల విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నదని మజ్లిస్ పార్టీ అధినేత తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింల పాత్ర కీలకమైందని - వారు దేశభక్తులన్న విషయం మరిచిపోవద్దని హైదరాబాద్ ఎంపీ చెప్పుకొచ్చారు. 70 ఏళ్లలో మజ్లిస్ పార్టీ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిందని - భవిష్యత్తులోనూ చేయబోతున్నదని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏపై ఈ నెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికలను బీజేపీ రెఫరెండంగా తీసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. తెలంగాణలో ఏ ఒక్కచోట బీజేపీకి మున్సిపల్ పీఠం దక్కబోదని జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఎంఐఎం నుంచి ఎన్నికల్లో పోటీలో ఉంటే కాంగ్రెస్ - బీజేపీలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తమ తండ్రి హయాం నుంచి కామారెడ్డి ప్రాంతం లో పార్టీ ఉందని అసదుద్దీన్ గుర్తుచేశారు. మజ్లిస్ పార్టీ ఒక్క హైదరాబాద్ కే పరిమితమయ్యిందని ప్రచారం చేస్తుండటాన్ని ఆయన తప్పు పట్టారు. మజ్లిస్ పోరాడితే హిందూ - ముస్లింల మధ్య మతకల్లోలాలను బీజేపీ సృష్టిస్తుందని ఆరోపించారు.