బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసా భారీ సవాల్ విసిరారు. అమిత్ షాకు నిజంగా దమ్ముంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. హైదరాబాద్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దామని ప్రశ్నించిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని తాము సొంతం చేసుకుంటామని చెప్పారు.
సికింద్రాబాద్ ఎంపీ స్థానంతో పాటు అంబర్ పేట అసెంబ్లీ సీటును కూడా తాము సొంతం చేసుకుంటామన్న అసద్.. రానున్న ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నామరూపాల్లేకుండా పోతుందన్న ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అసద్ ఛాలెంజ్ కు అమిత్ రియాక్షన్ ఏమిటన్నది ఒక ప్రశ్న అయితే.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన తరహాలోనే అసద్ నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారింది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నామరూపాల్లేకుండా పోతుందని.. ఇప్పుడున్న ఐదుస్థానాలు కూడా ఆ పార్టీ గెలవలేదన్న మాటను కేసీఆర్ అంటే.. అవే మాటలు అసదుద్దీన్ నోటి నుంచి రావటం గమనార్హం. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ.. పదకొండు కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తన సత్తా చాటుతుందన్నారు. మరి.. ఎవరి మాటలు ఎంత వరకూ నిజమవుతాయన్నది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/