హైద‌రాబాద్‌ కు అమిత్‌ షా..ఓవైసీ ఘాటు స‌వాల్‌

Update: 2018-06-30 10:36 GMT

తెలంగాణ రాజ‌కీయాలు హాట్ హాట్‌ గా మారుతున్నాయి. ఇప్ప‌టికే అధికార ప్ర‌తిప‌క్షాలు స‌వాల్లు విసురుకుంటుంటే...తాజాగా ఇందులో కొత్త ప‌ర్వం తెర‌మీద‌కు వ‌చ్చింది. ప్ర‌తిప‌క్షంలోని ఒక్కో పార్టీలు త‌మ సిద్ధాంత‌ప‌ర‌మైన ప్ర‌త్య‌ర్థుల‌పై ఎదురుదాడిని మొద‌లుపెడుతున్నాయి. ఈ ప‌ర్వంలో తాజాగా హిందుత్వ‌వాదానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే బీజేపీ - మైనార్టీల ప్ర‌తినిధుల చెప్పుకొనే పాత‌బ‌స్తీ పార్టీ ఎంఐఎం మ‌ధ్య ప‌ర‌స్ప‌రం స‌వాళ్లు సాగాయి. తెలంగాణ‌లో త‌మ స‌త్తా చాటుకుంటామ‌ని ఓ పార్టీ ధీమా వ్య‌క్తం చేస్తే... ద‌మ్ముంటే హైద‌రాబాద్‌ లో త‌మ‌పై పోటీకి దిగాల‌ని మ‌రో పార్టీ స‌వాల్ విసిరింది.

తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేప‌డుతున్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు డా. కె లక్ష్మణ్ తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ సొంత జిల్లా సిద్ధిపేట‌లో మాట్లాడుతూ తెలంగాణను ఎడారిగా మార్చి రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సొంత గ్రామంలోనే ఓ దళిత వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నాలుగు గోడల ప్రగతి భవన్ ఏసీ గదుల్లో కూర్చొని బీజేపీ జన చైతన్య యాత్ర ఎఅక్కడ అని మాట్లాలాడుతున్న వాళ్ళు దుబ్బాకలో ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన జనం చూస్తే అర్థం చేసుకోవచ్చున‌ని అన్నారు. బీజేపీ జన చైతన్య యాత్ర అడ్డుకోవాలని చూస్తే.. ఈ యాత్ర జగన్నాథ రథ చక్రాల కిందపడి నలిగిపోవడం ఖాయమ‌ని ల‌క్ష్మణ్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌ ను, హైద‌రాబాద్‌ లో ఎంఐఎంను రాబోయే రోజుల్లో ఓడిస్తామ‌ని ప్ర‌క‌టించారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా త్వ‌ర‌లో తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నార‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఎంఐఎం ఆగ‌డాల‌ను తేట‌తెల్లం చేస్తార‌ని పేర్కొన్నారు.

మ‌రోవైపు ఆల్ ఇండియా మజ్లిస్ ఇతాహదుల్ ముస్లిమే(ఏఐఎంఐఎం) పార్టీ అధినేత - హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న సవాల్ చేశారు. దమ్ముంటే హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేయండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ఓవైసీ ఛాలెంజ్ చేశారు. ప్రధాని మోడీ అయినా.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అయినా.. ఎవరు పోటీ చేసినా ఎదుర్కునేందుకు తాము సిద్ధ‌మ‌ని అన్నారు. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు బ‌రిలో దిగినా గెలవలేరని ఓవైసీ అన్నారు. ఇక్క‌డ గెలుపు ఎంఐఎంకు మాత్ర‌మే సాధ్య‌మ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా ఓవైసీ సవాల్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్‌ - బీజేపీ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా .. ఎవరూ తన స్థానాన్ని చేజిక్కించుకోలేరని ధీమా వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News