వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ మధ్యన పెరిగిపోయిన సోషల్ మీడియా పుణ్యమా అని.. వివాదాస్పద వ్యక్తుల వ్యాఖ్యలు అంతకంతకూ వేగంగా ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. దీంతో.. వారి వాదనలకు మద్దతుగా నిలిచే వారు కొందరు.. వ్యతిరేకించే వారు మరికొందరు చేరిపోవటం.. ఎవరికి వారు తమ తమ వాదనల్ని వినిపించటం.. దీనిపై రెండు వర్గాలకు చెందిన వారు మాటల యుద్ధం చేసుకోవటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది.
తాజాగా.. యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వివాదాస్పద సన్యాసి కమ్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. పక్కా హిందుత్వ వాదిగా ముద్రపడిన ఈ ఫైర్ బ్రాండ్ నేత.. ఎన్నోసార్లు తన నోటికి పని చెప్పి.. యావత్ దేశాన్ని హాట్ హాట్ గా మార్చేశారు. అలాంటి నేతను సీఎంగా ఎంపిక చేసిన మోడీ నిర్ణయాన్ని ఇప్పటికే పలువురు తప్పు పడుతున్న పరిస్థితి.
ఇదిలా ఉంటే.. యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయటంపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఆదిత్యనాథ్ ను ఎన్నుకోవటం అంటే.. ప్రధాని నరేంద్రమోడీ తన నూతన భారత విజన్ ను ఆవిష్కరించటమేనని వ్యాఖ్యానించారు. అనాదిగా హిందూ.. ముస్లిం సంస్కృతుల సమ్మేళనమైన గంగాయమున తెహజీబ్ పై దాడి చేయటంగా ఓవైసీ అభివర్ణించారు.
మోడీ.. బీజేపీ కొత్త భారతమిది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.. పవర్ లో ఉన్నప్పుడు సమాజ్‌వాదీ పార్టీ ముస్లింలను వంచించింది ఇప్పుడు పరిమితవాద అభివృద్ధి నమూనాను మనం చూడబోతున్నామంటూ ఓవైసీ రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే.. సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరైన ఢిల్లీ జామా మసీదు ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ మాత్రం యోగి ఆదిత్యనాథ్ ఎంపికపై ఆచితూచి మాట్లాడటం గమనార్హం. తన వివాదాస్పద గతాన్ని వదిలేసి.. ప్రధాని మోడీ పేర్కొన్నట్లుగా అన్ని వర్గాల శ్రేయస్సు కోసం యోగి ఆదిత్యనాథ్ కృషి చేయనున్నట్లుగా పేర్కొన్నారు. యూపీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తిన్న మజ్లిస్ అధినేత ఓవైసీకి భిన్నంగా ఖుఖారీ ఆశావాహ దృక్ఫదంతో వ్యవహరించటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/