పీఎఫ్ఐపై నిషేధాన్ని తప్పుపట్టిన ఓవైసీ.. ముస్లింలపై నిషేధమే ఇదీ!

Update: 2022-09-28 15:46 GMT
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) , దాని అనుబంధ సంస్థలను కేంద్రప్రభుత్వం ఐదేళ్లు నిషేధించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు.అయితే తన స్టాండ్ పీఎఫ్ఐకి అనుకూలం కాదని స్పష్టం చేశారు.ఈ రకమైన కఠిన నిషేధం ప్రమాదకరమని.. అది తన అభిప్రాయాన్ని చెప్పాలనుకునే ముస్లింలపై నిషేధం అని ఘాటు వ్యాక్యలు చేశారు.

ప్రతి ముస్లిం యువకుడు ఇప్పుడు భారత్ లోని నల్లచట్టం కింద పీఎఫ్ఐ కరపత్రంతో అరెస్ట్ చేయబడుతారంటూ అసదుద్దీన్ ఘాటు ట్వీట్ చేశారు. ముస్లింలను కోర్టులు నిర్ధోషులుగా ప్రకటించబడక ముందే దశాబ్ధాలుగా జైలు జీవితం గడిపారని.. నేను యూఏపీఏను వ్యతిరేకించానని అన్నారు. రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగమైన స్వేచ్ఛ యొక్క సూత్రానికి విరుద్ధంగా నడుస్తుందని ఓవైసీ ట్వీట్ చేశారు.

యూఏపీఏని కఠినతరం చేయడానికి కాంగ్రెస్ సవరణలు చేసిందని.. దాని ప్రస్తుత ప్రభుత్వం మరింత కఠినంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. మితవాద మెజారిటీ సంస్థలను ప్రభుత్వం ఎందుకు నిషేధించలేదని ప్రశ్నించారు.

కాగా అతివాద సంస్థ ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (పీఎఫ్ఐ)ని కేంద్రప్రభుత్వం నిషేధించింది. ఈ సంస్థ సభ్యులకు ముష్కర ముఠాలతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధన చట్టం కింద చర్యలు తీసుకుంది. పీఎఫ్ఐ సహా దాని అనుబంధ సంస్థలు ఆలిండియా ఇమామ్ కౌన్సిల్, రెహాబ్ ఇండియా ఫౌండేషన్, నేషనల్స్ ఉమెన్ ఫ్రెంట్ ను చట్ట విరుద్ధంగా ఏర్పడ్డ సంస్థలుగా పేర్కొంటూ కేంద్ర హోంశాఖ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News