వ‌చ్చి న‌న్ను చంపెయ్‌: ఒవైసీ

Update: 2018-12-06 06:58 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఎం ఐ ఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ - బీజేపీ నేత టి.రాజాసింగ్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తార‌స్థాయికి చేరింది. దీంతో మ‌జ్లిస్ - బీజేపీ శ్రేణుల మ‌ధ్య ఉద్రిక‌త్త‌లు నెల‌కొన్నాయి. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

బీజేపీ త‌ర‌ఫున రాజాసింగ్ గోషామ‌హ‌ల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం లో భాగం గా మ‌జ్లిస్ ను ఆయ‌న దునుమాడారు. ఆ పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. సెక్యూరిటీ ని ప‌క్క‌న పెట్టి త‌న‌తో 15 నిమిషాలు కొట్లాట‌కు దిగాలంటూ ఒవైసీకి స‌వాలు విసిరారు.

రాజాసింగ్ స‌వాల్ కు ఒవైసీ తాజాగా స్పందించారు. గ‌త 25 ఏళ్ల‌లో తానెప్పుడూ సెక్యూరిటీని వెంట ఉంచుకోలేద‌న్నారు. ఎప్పుడూ ఒంట‌రిగానే తిరుగుతున్నాన‌న్నారు. ఆశ‌య సాధ‌న ప్ర‌య‌త్నం లో చావ‌డానికి త‌న‌కు ఎలాంటి భ‌యం లేద‌న్నారు. వ‌చ్చి త‌న‌ను చంపేయాలంటూ రాజాసింగ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.

రాజాసింగ్ ఉప‌యోగిస్తున్న భాష‌ పై ఒవైసీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అలాంటి భాష‌నే తాను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పై ఉప‌యోగించి ఉంటే.. దాన్ని హిందూ - ముస్లింల గొడ‌వ‌గా రాజాసింగ్ చిత్రీక‌రించేవాడ‌ని పేర్కొన్నారు. ఉగ్ర‌వాద సంస్థ‌ ల‌ష్క‌రే తొయిబా ఏజెంట్ గా, బిన్ లాడెన్ కు స్నేహితుడిగా త‌న‌ను అభివ‌ర్ణించే వాడని చెప్పారు. ఇక‌ నైనా రాజాసింగ్ నోరు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు. గ‌తం లో అస‌దుద్దీన్ త‌మ్ముడు అక్బ‌రుద్దీన్‌ ఒవైసీ పై రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అక్బ‌రుద్దీన్ త‌ల న‌రుకుతాన‌ని హెచ్చ‌రించారు.


Tags:    

Similar News