ఎంఐఎం పార్టీ చీఫ్ - హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ మరోమారు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంతేకాదు జిహాద్ అంటే కొత్త భాష్యం చెప్పారు. జిహాద్ అంటే ప్రత్యేక దేశం కాదని - జిహాదీలంటే ప్రాణాలు తీసే వారు కాదని ఓవైసీ అన్నారు. పేద పిల్లల పెళ్లిళ్లు చేయడమే నిజమైన జిహాదీ అని ఓవైసీ చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ లోని ముస్లిం యువకులను ఉద్దేశించి ఓవైసీ మాట్లాడారు. ఇస్లాంకు చెందని వారి చేతుల్లో ఇస్లామిక్ స్టేట్ సంస్థ బందీగా మారిందన్నారు. సౌదీలోని మదీనాలో జరిగిన బాంబు పేలుళ్లను ఓవైసీ ఖండించారు. ఒకవేళ నిజంగా జిహాదీ చేయాలనుకుంటే ఆయుధాలను వదలిపెట్టాలని - పేదలకు అన్నం పెట్టాలని - అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఉగ్రవాద సంస్థ నేత అబు అల్ బాగ్దాదీపై తీవ్ర స్థాయిలో ఓవైసీ విమర్శలు చేశారు. ముస్లింలను బాగ్దాదీ తీవ్రంగా క్షోభకు గురిచేశారన్నారు. మాటల్లో చెప్పలేనంతగా ముస్లిం సోదరులను ఉగ్రవాదులు ఇబ్బంది పెట్టారని ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. సుసైడ్ బాంబర్లపైన కూడా ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆత్మాహుతి దాడులకు పాల్పడేవాళ్లు నరకంలో కుక్కలంటూ ఓవైసీ వ్యాఖ్యానించారు. ముస్లిం యువత ఇస్లాం మతం కోసం జీవించాలని - మతం కోసం ఎవరూ ప్రాణాలు అర్పించరాదని అన్నారు. రంజాన్ మాసంలో జరిగిన ఉగ్ర దాడులను ఖండిస్తూ హైదరాబాద్ లో ముస్లిం యువకులు ఈ సందర్భంగా తీర్మానం చేశారు.