సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఆ మధ్యన తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆయన.. ఈ మధ్యన కాస్త జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. అలా అని వెనక్కి తగ్గినట్లు కాకుండా పాయింట్ టు పాయింట్ అన్నట్లుగా ఆచితూచి లెక్కలేసుకొని మాట్లాడటం కనిపిస్తుంది.
అయోధ్యలో రామమందిరం మీద సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై అసద్ రియాక్ట్ అయ్యారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని.. దాన్ని ఎవరూ ఆపలేరంటూ భగవత్ చేసిన వ్యాఖ్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అసద్. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చెప్పటానికి భగవత్ ఎవరని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఉదతం సుప్రీంకోర్టులో ఉందని.. ఏ అధికారంలో మోహన్ భగవత్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నించిన అసద్.. మోహన్ భగవత్ ఏమైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తా? అని ప్రశ్నించారు. రామమందిరం నిర్మించి తీరుతామని.. ఆ విషయంలో మరో మాటకు అవకాశం లేదన్న మాటను చెప్పిన భగవత్ వ్యాఖ్యల్ని తప్పు పట్టారు అసదుద్దీన్ ఓవైసీ.
ఇదిలా ఉంటే.. తమిళనాడు బీజేపీ సీనియర్ నేత.. ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. వచ్చే ఏడాది దీపావళిని రామమందిరంలో నిర్వహిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు.. వివాదాస్పద స్థలంపై కోర్టులో ఉన్న వ్యాజ్యం రేపు (మంగళవారం) విచారణకు రానుంది. మరి.. ఈ వ్యవహారంపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.