బీజేపీ 'కంచుకోట' పై కన్నేసిన ఒవైసీ !

Update: 2020-12-16 13:30 GMT
దేశంలో భారతీయ జనతా పార్టీ రోజురోజుకి మరింతగా బలంగా తయారౌతు, ఒక్కొక్క రాష్ట్రంలో పాగా వేస్తూ ముందుకు సాగుతుంది. ఇక యూపీ అనేది బీజేపీకి ఆయువు పట్టు. అలాంటిది ఆ రాష్ట్రంలో ఒవైసీ కన్నేసినట్టు తెలుస్తుంది. బీహార్ ఎన్నికల్లో సత్తా చాటిన ఒవైసీ , బీజేపీ కంచుకోట అయిన యూపీని చేజిక్కించుకోవాలని వ్యూహాలు పన్నుతున్నాడు. అక్కడి చిన్నా చితక పార్టీలతో కలిసి, పొత్తు పెట్టుకుని ఎన్నికల గోదాలోకి దిగాలని ఓ ప్రాథమిక నిర్ణయానికి వచ్చేశారు. అందులో భాగంగా చిన్న పార్టీల అధినేతలతో సమావేశమవుతున్నారు.

తాజాగా భారతీయ సమాజ్‌పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్ రాజ్‌ భర్ తో సమావేశమయ్యారు. అంతేకాకుండా సమాజ్‌వాదీ నుంచి విడిపోయిన వేరు కుంపటి పెట్టుకున్న శివపాల్ యాదవ్ ‌పై ఒవైసీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక, శివపాల్ యాదవ్ కూడా ఒవైసీని ప్రశంసించారు. వీటన్నింటి నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో యూపీ ఎన్నికల గోదాలోకి దిగాలని ఒవైసీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బిహార్‌ లో ఐదు సీట్లు గెలిచిన నేపథ్యంలో, బిహార్ స్ఫూర్తితోనే తమ అధినేత యూపీపై కన్నేశారని, చిన్నా చితక పార్టీలతో 2022 గోదాలోకి దిగుతున్నారని ఎంఐఎం నేతలు చెప్తున్నారు.

చిన్న పార్టీలు పెద్ద పార్టీలతో వెళ్లకుండా, ఎన్నికంటే ముందే ఒకరితో ఒకరు చేతులు కలిపి, ఎన్నికల గోదాలోకి దిగాలని నిర్ణయించుకున్నాయి. భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలో బాూబు సింహ్, అనిల్ సింహ్ చౌహాన్, బూబు రామ్‌ పాల్ ఇలా ఇప్పటికే యూపీలో ఓ కూటమి తయారైంది. ఇప్పుడు ఒవైసీ కూడా ఈ కూటమిలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో కూడా జట్టు కట్టాలని ఒవైసీ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు.
Tags:    

Similar News