టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడిపోతోంది. మరో రెండు నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా... అన్ని వైపుల నుంచి చంద్రబాబుకు షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి అండగా నిలిచిన బీసీలు క్రమంగా వైసీపీ వైపు చేరగా... ఇప్పుడు ముస్లిం ఓటు బ్యాంకు కూడా టీడీపీకి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. మైనారిటీ కోటా కింద గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు అవకాశం ఇచ్చే విషయంలో ఎప్పటికప్పుడు కప్పదాటు వైఖరిని అవలంబించిన చంద్రబాబు.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఫరూక్ కు మంత్రి పదవితో పాటు మరో మైనారిటీ నేతకు శాసనమండలిలో కీలక పదవి ఇచ్చారు. అయినా కూడా మైనారిటీలు టీడీపీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితోనే ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో తెలంగాణకు చెందిన మజ్లిస్ పార్టీ కూడా ఇప్పుడు చంద్రబాబుకు యాంటీగా ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగబోతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ ప్రకటిస్తే... అందులో తాను కూడా కీలక భూమిక పోషిస్తానని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు అసద్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. నేడు దారుసలాంలో జరిగిన ఎంఐఎం 61వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. జగన్ నుంచి పిలుపు వస్తే... ఇప్పటికిప్పుడు ఏపీలో ప్రచారం చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించడం గమనార్హం. ఒకవేళ జగన్ పిలుపు గనుక ఇస్తే... అసద్ ఏపీలోకి ఎంట్రీ ఇస్తే... టీడీపీకి, ప్రత్యేకించి మైనారిటీ వర్గాలపై భారీ ఆశలు పెట్టుకున్న చంద్రబాబుకు గట్టి ఎదురు దెబ్బ తప్పదన్న వాదన వినిపిస్తోంది.