ఎంఐఎం పార్టీ అధినేత - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాక్షసమూక ఐసిస్ పై ఆసక్తికర కామెంట్లు చేశారు. హైదరాబాద్ లో ఐసిస్ సానుభూతిపరుల అరెస్టు నేసథ్యంలో ఆయన స్పందించారు. మిలిటరి సహాయంతో ఐఎస్ ఐఎస్ ను సర్వనాశనం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా దాని భావాజాలాన్ని రూపుమాపాలని అసద్ వ్యాఖ్యానించారు. ఐసిస్ ఉగ్రవాదులు అరెస్టయిన రెండ్రోజుల తర్వాత అసుదుద్దీన్ మీడియాతో మాట్లాడారు.
ఎంఐఎం పార్టీ ఐసిస్ కు తీవ్ర వ్యతిరేకమని అసద్ స్పష్టం చేశారు. తాము ముందు నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నామని గుర్తుచేశారు. అరాచకాలకు పాల్పడుతున్న ఐసిస్ తప్పకుండా అంతం చేయాల్సిన సంస్థ అని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. గతంలో ఐసిస్ నుంచి అసదుద్దీన్ బెదిరింపులు ఎదుర్కున్న విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ ఈ ఆసక్తికరమైన డిమాండ్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇప్పటికే ఉగ్రవాదులకు అడ్డాగా హైదరాబాద్ మారిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న క్రమంలో ఎంఐఎం డిమాండ్ ఆసక్తికరంగా మారింది.