అన్నం పెట్టే అన్నదాతలకు మరింత చేయూతనిచ్చేందుకు కేసీఆర్ సర్కార్ చేపట్టిన రైతుబంధు పథకాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టిందనే వార్తలు వచ్చాయి. దేశవ్యాప్తంగా కర్షకులను ఆదుకునేందుకు వినూత్నంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో ఆర్థిక సాయాన్ని అందించనుంది. వ్యవసాయ సమస్యలపై కేసీఆర్ కు ఉన్న లోతైన అవగాహన మరే నేతకు లేవని ఓవైసీ ట్వీట్ చేశారు. తెలంగాణ చేపట్టిన పథకాలనే ప్రధాని అమలు చేస్తున్నారని, ప్రధాని మోడీకి స్వంత ఐడియాలు లేవని ఓవైసీ అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కేసీఆర్ లాంటి నేతలు అవసరమన్నారు.
ఇవాళ కేంద్ర బడ్జెట్ లో కిసాన్ సమ్మాన్ నిధిని ప్రకటించిన తర్వాత ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ట్విట్టర్ లో స్పందించారు. సంచలన నిర్ణయాలతో దేశ రాజకీయాల్లో విలక్షణ ప్రధానిగా పేరుగాంచిన మోడీ కూడా ఇప్పుడు కేసీఆర్ బాటనే ఎంచుకున్నారని ఓవైసీ అన్నారు. ``దేశ రైతాంగాన్ని కాపాడేందుకు - వ్యవసాయ సంక్షోభాన్ని తరిమేందుకు మోడీ ప్రభుత్వం అన్ని వర్గాలు హర్షించే కిసాన్ సమ్మాన్ పథకాన్ని తీసుకువచ్చింది. తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ ఫుల్ గా అమలు చేసిన రైతుబంధును మోడీ సర్కార్ కాపీ కొట్టడం నిజంగా అది కేసీఆర్ ఔనత్యానికి చెందుతుంది. కేసీఆర్ లాంటి రాజకీయ దూరదృష్టి ఎంతైనా అవసరమని ఈ పథకంతో తెలుస్తోంది. ప్రకృతి విలయంతో తాండవిస్తున్న అనేక కరువు ప్రాంతాలు ఇప్పుడు రైతుబంధు లాంటి పథకంతో సస్యశ్యామలంగా మారనున్నాయి. ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్ కే దక్కుతుంది. దేశానికి దిశానిర్దేశం చేసే సత్తా కూడా కేసీఆర్ కే ఉంది` అని ఓవైసీ అన్నారు. కేసీఆర్ చురుకుదనం - ముందుచూపు - ఆయనలోని అమోఘమైన జ్ఞానం దేశానికి రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతోందని అసద్ అన్నారు.