విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి వెనుక భారీ కుట్ర ఉందన్నారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. తన స్నేహితుడు జగన్ హత్యాయత్నం నుంచి అదృష్టవశాత్తు తప్పించుకున్నారని.. దేవుడుచాలా గొప్పవాడన్నారు.జగన్‌ను ఆయన నివాసంలో కలిసి పరామర్శించిన అసద్ అనంతరం విలేవకరులతో మాట్లాడారు. జగన్ ను కలిసిన సందర్భంగా ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్న క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
తన మిత్రుడు జగన్ ను హత్య చేయటానికి ప్రయత్నించారన్నారు. అయినా.. ఒక వ్యక్తి ఎయిర్ పోర్ట్ లోకి అదీ కూడా వీఐపీ లాంజ్ లోకి కత్తితో ఎలా వచ్చాడు? అని ఓవైసీ ప్రశ్నించారు. జగన్ గొంతుపైన పొడవటానికి ప్రయత్నించారన్న ఓవైసీ.. ఈ దాడిపై చంద్రబాబు స్పందించిన తీరు ఘోరంగా ఉందన్నారు.
రాజకీయ విభేదాలు ఎప్పుడూ ఉంటాయని.. అయితే ఒక సీఎం అలా మాట్లాడటం ఏ మాత్రం సరికాదాన్నారు. జగన్ పై దాడి నేపథ్యంలో కనీసం ఫోన్లో అయినా మాట్లాడి ఉండాల్సిందని.. ఆ మాత్రం పరామర్శించలేరా? అని వ్యాఖ్యానించారు.
మనమంతా మనుషులమని..సాటి మనిషిపై మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్న అసద్.. ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ఇలాంటివి ఆశించటం అత్యాశే అవుతుంన్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జగన్ ను మరింత జాగ్రత్తగా ఉండాలని తాను చెప్పినట్లు చెప్పారు.
భవిష్యత్తు రాజకీయాల్లో జగన్ తిరుగులేని నేత అవుతారన్న ఓవైసీ.. జగన్ ను నిర్మూలించాలని చేసే కుట్రపై ఏపీ ప్రజలు గళం విప్పాలన్నారు. బాబు గేమ్ ప్లాన్ ను ఏపీ ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు.
బాబు ఆడే ఆటల్ని ఏపీ ప్రజలు త్వరలోనే అర్థం చేసుకొని.. తగిన రీతిలో సమాధానం చెబుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఓవైసీ. జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని తక్కువ చేసి మాట్లాడటం ద్వారా చంద్రబాబు ఏపీ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలిచారని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి నేత.. విపక్ష నేతపై జరిగిన దాడిని మానవత్వంతో అయినా స్పందించి.. పరామర్శించకుండా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యిందని చెప్పక తప్పదు.