విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హ‌క్కుః అస‌దుద్దీన్.. ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌లికి ఓవైసీ!

Update: 2021-03-05 17:30 GMT
వైజాగ్ స్టీల్ ఫ్యాక్ట‌రీని కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేటీక‌రించాల‌ని తీసుకున్న నిర్ణ‌యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ స‌మితి ఆధ్వ‌ర్యంలో కార్మిక సంఘాలు నిర‌స‌న చేప‌డుతూనే ఉన్నాయి. ఈ పోరాటానికి మ‌జ్లీస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ప్రైవేటీక‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం స‌రికాద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణ‌యాన్ని త‌మ పార్టీ త‌ర‌పు ఖండిస్తున్నామ‌ని అన్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హ‌క్కు అని అస‌దుద్దీన్ నిన‌దించారు. ఈ ఫ్యాక్టరీకోసం ఎంతో మంది బ‌లిదానాలు చేశార‌ని ఆయ‌న గుర్తు చేశారు. అలాంటి ఫ్యాక్టరీని ప్రైవేటు వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెట్ట‌డం దారుణ‌మ‌ని, ఆ నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు.

కాగా.. ఎంఐఎం పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచింది. ఈ నేప‌థ్యంలో క‌ర్నూలు జిల్లాలో ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో పాల్గొనేందుకు వెళ్లారు ఓవైసీ. అదోని ప‌ట్ట‌ణానికి వెళ్తున్న ఆయ‌న‌.. మార్గం మ‌ధ్య‌లో కొడుమూరు ప‌ట్నంలో ఆగి, అక్క‌డ బంద్ పాటిస్తున్న కార్మికుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించి, మాట్లాడారు.
Tags:    

Similar News