60 ఏళ్ల ఎంఐఎం టార్గెట్ ఏంటో చెప్పిన ఓవైసీ

Update: 2018-03-02 10:36 GMT
పాత‌బ‌స్తీ కేంద్రంగా ఏర్ప‌డి ఓ వ‌ర్గం వారికి బ‌ల‌మైన మ‌ద్ద‌తుగా ఉంటూ వారికోస‌మే గ‌ళం విప్పే అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ 60 ఏళ్లు పూర్తిచేసుకుంది. దివంగ‌త స‌లావుద్దీన్ ఓవైసీ ప్రారంభించిన ఈ పార్టీ ప్ర‌స్తుతం ఆయ‌న త‌న‌యుడైన హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సార‌థ్యంలో న‌డుస్తోంది. మజ్లిస్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను శుక్రవారం నిర్వహించిన సంద‌ర్భంగా ఏఐఎంఐఎం అధినేత ఓవైసీ పార్టీ ప్రధాన కార్యాలమైన‌ దారుస్సలాంలో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. పార్టీని బ‌లోపేతం చేస్తామ‌ని, త‌మ ప్ర‌త్య‌ర్థి పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్‌ల‌ను ఫినిష్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

దారుస్సలాంలో ఎంఐఎం పార్టీ పునరుజ్జీవన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తమ పార్టీని తెలంగాణలో పటిష్టం చేస్తామన్నారు. ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకుంటామని ఓవైసీ తెలిపారు. ప్రజల పక్షాన తమ పార్టీ పోరాడుతుందని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణలో బీజేపీ - కాంగ్రెస్ పార్టీలను అంతం చేయడమే ఎంఐఎం లక్ష్యమని ఓవైసీ స్పష్టం చేశారు. పార్టీని విస్త‌రించేందుకు ఇక నుంచి ఆయా ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తాన‌ని ఓవైసీ వెల్ల‌డించారు.

కాగా, ఓవైసీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పార్టీ బ‌లోపేతం గురించి చెప్తూనే....తెలంగాణ‌లో అధికార‌ప‌క్ష‌మైన టీఆర్ ఎస్ పార్టీకి మిన‌హాయింపు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. జాతీయ పార్టీలు అయిన బీజేపీ - కాంగ్రెస్‌ ల‌ను అంతం చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించిన ఓవైసీ అధికార టీఆర్ ఎస్ పార్టీ పేరును మాత్రం ప్ర‌స్తావించ‌లేదు. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌ కు మిన‌హాయింపు ఇవ్వ‌డం ప‌ట్ల ఇప్ప‌టికే ఉన్న అప్ర‌క‌టిత దోస్తీ కార‌ణ‌మ‌ని అంటున్నారు.
Tags:    

Similar News