ఆరోగ్య సేతు ప‌నికిమాలిన యాప్‌: అస‌ద్

Update: 2020-05-03 08:50 GMT
దేశవ్యాప్తంగా కరోనా వైర‌స్ వివ‌రాలు - అవ‌గాహ‌న క‌ల్పించ‌డం.. వైర‌స్‌ కు సంబంధించిన అన్ని వివ‌రాలు తెల‌ప‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన యాప్ ఆరోగ్యసేతు. ఈ యాప్‌ ను అంద‌రూ వినియోగించాల‌ని సూచిస్తోంది. ఈ ఆప్ ప్రతి ఒక్కరి ఫోన్లలో తప్పకుండా ఉండాలని తెలిపింది. అయితే యాప్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌మాదంగా మారింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌జ‌ల వివ‌రాలు త‌స్క‌ర‌ణ‌కు గుర‌యితాయ‌ని పుకార్లు వ‌చ్చాయి. ఈ స‌మ‌యంలోనే ఏఐఎంఐఎం పార్టీ అధినేత - హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

ఆరోగ్య సేతు యాప్ పనికిమాలిన యాప్ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ట్వీట్ట‌ర్‌ లో ఈ యాప్‌ పై విమ‌ర్శ‌లు చేశారు. ఈ యాప్‌ వినియోగించే వారి డేటా నిరర్ధకంగా మారే ప్రమాదం కనిపిస్తోందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ ను  ప్రభుత్వం నమ్మదగినదిగా లేని ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌ తో ఎదుర్కోవాలని చూడడం దురదృష్టకరమని తెలిపారు. ఈ యాప్‌ను వినియోగిస్తే అందులో వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేయాల్సి ఉంటుందని. అది వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోంద‌ని ఆరోపించారు. ఓవైసీ చేసిన విమ‌ర్శ‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. క‌రోనా వేళ రాజ‌కీయాలు వ‌ద్ద‌ని కొంద‌రు చెబుతుండ‌గా.. ఆ యాప్‌పై ప్ర‌జ‌ల వివ‌రాలు - గోప్య‌త బ‌హిర్గ‌తం కాద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

Tags:    

Similar News