ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈసారి హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంతో పాటు మరో చోట కూడా పోటీ చేస్తారట.. ఇదేంటి, కేసీఆర్ హైదరాబాద్ లోక్ సభ స్థానాన్న ఒవైసీ కోసం వదిలేసి మిగతా 16 నియోజకవర్గాల గురించే మాట్లాడుతున్న వేళ ఆయన ఇంకో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారా అనుకోవద్దు.. తెలంగాణలో కాదు - ఉత్తరప్రదేశ్ లోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారట ఆయన.
మూడు సార్లు హైదరాబాద్ నుంచి గెలిచిన ఒవైసీ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీచేయాలనుకోవడానికి కారణం ఆ పార్టీ నేత షౌకత్ అలీ. ఆయన సూచనతోనే ఒవైసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అలీ ఈ ప్రతిపాదన చేయగానే ఒవైసీ స్పందిస్తూ.. యూపీలో తాను పోటీ చేస్తే చాలామందికి నిద్ర పట్టదని అన్నారట. అయితే.. ఒవైసీ యూపీలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా నిర్ణయించుకోనప్పటికీ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న రాంపూర్ - షహరన్ పూర్ - ఆజంఘర్ - ఫిరోజాబాద్ లలో ఏదో ఒక చోటి నుంచి పోటీచేస్తారని భావిస్తున్నారు.
ఒవైసీ అక్కడ బరిలో ఉంటే ఓట్లు చీలుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ ఎస్పీ - బీఎస్పీలు కలిసి పోటీ చేయడానికి నిర్ణయించాయి. కాంగ్రెస్‌ది ఒంటరి పోరే. అలాంటప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పడే ముస్లిం ఓట్లు చీలే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో ఎంఐఎం కొన్ని స్థానాల్లో పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయింది. అలాంటప్పుడు ఒవైసీ అక్కడ గెలిచే అవకాశాలు తక్కువే. దాంతో.. ఆయన ప్రయత్నం ఎవరికి లబ్ధి చేకూర్చడానికో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.