అసదుద్దీన్ కూడా ఉద్యమానికి రెడీ అవుతున్నారు

Update: 2017-01-28 07:29 GMT
దక్షిణాది కేంద్రంగా రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయి. తమిళనాడులో జల్లికట్టు.. కర్ణాటకలో కంబాళ.. ఏపీలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమ సెగ ఇప్పటికే మొదలు కాగా తాజాగా హైదరాబాద్ కేంద్రంగా మరో ఉద్యమం మొదలు కానుంది. దేశంలో ముస్లిం గళం బలంగా వినిపించే పార్టీగా పేరున్న ఎంఐఎం ట్రిపుల్ తలాక్ కోసం ఉద్యమించడానికి సిద్ధమవుతోంది.
    
ట్రిపుల్ తలాక్ పై పెను ఉద్యమం చేద్దామంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ,  తమిళుల జల్లికట్టు ఉద్యమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా తల వంచాల్సి వచ్చిందని, అందుకే ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ముస్లింల పెళ్లిళ్లు - ట్రిపుల్ తలాక్ వంటి సంప్రదాయాల్లో ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉండేలా పోరాడాలని ఆయన అన్నారు  తమిళుల్లాగే ముస్లింలకూ  సొంత సంస్కృతి ఉందని, సంప్రదాయాలు ఉన్నాయని..  నచ్చినట్టు పెళ్లిళ్లు చేసుకుని, విడాకులు తీసుకునే హక్కు ఉందన్నారు.
    
తమకు ఎవరూ ప్రవర్తనా నియమావళి విధించడానికి వీల్లేదన్న అసద్.. దీనికోసం ఉద్యమించనున్నట్లు ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ ను పలు ముస్లిం మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News