కాషాయ త‌ల‌పాగాతో ఒవైసీ...వైర‌ల్!

Update: 2018-05-10 13:00 GMT
సంద‌ర్భానుసారంగా బీజేపీపై, ప్ర‌ధాని మోదీపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంలో ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ ముందుంటారు. ఏ మాత్రం అవ‌కాశం దొరికినా హిందూ అతివాద గ్రూపుల‌పై, బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ ల పై మండిప‌డుతుంటారు. బీజేపీ నేత‌ల‌పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఓ మాట‌లో చెప్పాలంటే `కాషాయ‌`రంగంటే ఒవైసీకి అస్స‌లు గిట్టదు. అటువంటి ఒవైసీ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చార స‌భలో ధ‌రించిన `కాషాయ‌` రంగు త‌ల‌పాగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో జేడీఎస్ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తోన్న ఒవైసీ బెల్గాంలో జ‌రిగిన బహిరంగసభలో త‌న స‌హ‌జ‌శైలికి భిన్న‌మైన వేష‌ధార‌ణ‌లో క‌నిపించి అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌లో ముంచెత్తారు. ప్ర‌స్తుతం ఒవైసీ కాషాయ త‌ల‌పాగా ధ‌రించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

సాధార‌ణంగా ఒవైసీ....ముస్లిం సంప్ర‌దాయం ప్ర‌కారం టోపీ ధరిస్తుంటారు. అయితే, అందుకు భిన్నంగా ఆ బ‌హిరంగ స‌భ‌లో కాషాయ రంగు తలపాగాను ధరించి బీజేపీకి షాక్ ఇచ్చారు. కాషాయమంటే విరుచుకుప‌డే ఒవైసీ ...ఆ రంగు త‌ల‌పాగా ధ‌రించ‌డం హాట్ టాపిక్ అయింది. గతంలో మోదీతో స‌హా ప‌లువురు బీజేపీ నేత‌లు ఆ త‌ర‌హా కాషాయ త‌ల‌పాగాను ధ‌రించిన నేప‌థ్యంలో ఒవైసీ త‌ల‌పాగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. మ‌రోవైపు ఈ బ‌హిరంగ స‌భ‌లో బీజేపీ, కాంగ్రెస్ ల పై ఒవైసీ మండిప‌డ్డారు. సిద్ధ‌రామ‌య్య పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ కాకుండా ప్రాంతీయ పార్టీల‌న్నీ క‌లిసి థ‌ర్డ్ ఫ్రంట్ గా ఏర్ప‌డాల‌ని, అందుకే జేడీఎస్ కు మ‌ద్ద‌తిస్తున్నాన‌ని ఒవైసీ అన్నారు. మోదీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీల‌న్నీ ఏకంకావాల‌ని ఒవైసీ పిలుపునిచ్చారు. రాబోయేఎన్నిక‌ల్లో మోదీని గుజ‌రాత్ పంపించేందుకు థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్ప‌డాల్సిన చారిత్ర‌క అవ‌స‌ర‌ముంద‌ని ఒవైసీ అన్నారు. థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాన‌న్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఒవైసీ మ‌ద్ద‌తిచ్చిన సంగ‌తి తెలిసిందే.  ఈ ఎన్నికల్లో ఎంఐఎం తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపకపోవడం గమనార్హం.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News