గొంతు తడారిపోయే నిజం. పలువురు విమర్శకులు చెప్పినట్లు భారతదేశంలోని సంపన్నుల అసలుసిసలు సొమ్మును బయటకు తీస్తే.. భారత్ ఎంత సంపన్నమైన దేశమోనన్న విషయం చూసి ప్రపంచమే షాక్ తింటుందని చెబుతుంటారు.
స్వామీజీ పేరుతో చలామణి అవుతూ.. నిత్యం నీతిబోధనలు చేస్తూ.. పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడటమే కాదు.. లైంగిక దాడి.. రేప్ కేసులో అరెస్ట్ అయి.. జైలు పాలైన దొంగ స్వామి ఆశారాం బాపు అసలు స్వరూపం చూసి విస్మయం వ్యక్తమవుతోంది. అతడి ఆర్థిక స్థాయిని నోట మాట రాని పరిస్థితి. దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ తో పాటు.. ఎన్నో వ్యాపారాలు నిర్వహించే ఇతగాడు.. కేసుల నుంచి బయటకు వచ్చేందుకు.. పోలీసులకు పెద్ద ఎత్తున డబ్బు ముట్ట చెప్పేందుకు ప్రయత్నిస్తున్న వైనం బయటకు పొక్కింది.
ఆశారాం.. అతని కొడుకు నారాయణ్ సాయిలు ప్రస్తుతం జోధ్ పూర్.. సూరత్ జైళ్లలో మగ్గుతున్న పరిస్థితి. ఇటీవల ఆశారాం శిష్యుడి అపార్ట్ మెంట్లో సోదాలు జరిపి పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు.. హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకోవటమే కాదు.. వీటి విలువను లెక్కింపు మొదలు పెట్టిన అధికారులకు నోట మాట రాని పరిస్థితి.
మొత్తంగా చూస్తే.. ఆశారాం పేరిట బినామీ ఆస్తులు దాదాపు రూ.10వేల కోట్ల వరకు ఉండొచ్చని ఒక అంచనా.. ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికాలోని కొన్ని సంస్థల్లో కూడా అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్లుగా బయటకు వచ్చింది. భారీ వడ్డీలకు దాదాపు 500 సంస్థలకు రుణాలు ఇచ్చే వారని.. రేప్ కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారుల్ని తమ వైపునకు తిప్పుకునేందుకు ఏకంగా రూ.8కోట్లు కేటాయించిన విషయం బయటకు వచ్చింది.
ప్రస్తుతం అతని ఆదాయం.. అతని దగ్గరున్న ఆస్తిపాస్తుల వివరాల్ని చూస్తున్న ఆదాయపన్ను అధికారుల అభిప్రాయం ప్రకారం.. ఆశారం పెద్ద ఎత్తున పన్ను గవేతకు పాల్పడటమే కాకుండా.. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని కూడా అతిక్రమించినట్లుగా తేలుతుందని చెబుతున్నారు. వేలాది కోట్ల రూపాయిలు వందలాది మందికి రుణాలుగా ఇస్తున్నట్లు గుర్తించిన విచారణాధికారులకు.. ఆశారాం బాపూ వ్యవహారంలో ఎంత తవ్వితే అన్ని వివరాలు వచ్చేటట్లు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. పేరుకు సన్యాసే కానీ.. పేరులో ఉన్నట్లు డబ్బు మీద మరీ ఇంత ఆశా..?