కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు పాల్గొనడం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అక్కడి తెలుగు ప్రజలు బీజేపీకి ఓటు వేయొద్దని అశోక్ బాబు ప్రచారం చేశారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, ఆయన ప్రచారానికి టీడీపీ నేతలు స్పాన్సర్ చేశారని పుకార్లు వెలువబుతున్నాయి. ఆయన....టీడీపీ మద్దతుదారుడని, అందుకు తమ దగ్గర సాక్ష్యాలున్నాయని ప్రతిపక్షాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. అయితే, ఈ వ్యాఖ్యలను అశోక్ బాబు ఖండించిన సంగతి తెలిసిందే. తన ప్రచారం పై బీజేపీ నేతలకు అంత అభ్యంతరం ఉంటే తాను తన పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే అశోక్ బాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారని సోషల్ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై అశోక్ బాబు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు అశోక్ బాబు సన్నిహితుడని మొదటి నుంచి టాక్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని....ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారని టాక్ వస్తోంది. దాదాపుగా ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగవచ్చని సోషల్ మీడియాలో ఊహాగానాలు వెలువడుతున్నాయి. అశోక్ బాబును ఉపయోగించుకొని ఉద్యోగుల మద్దతు కూడగట్టేందుకు చంద్రబాబు యత్నిస్తోన్నట్లు ఆరోపణలున్నాయి. అదీగాక వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్ల రాబోయే ఎన్నికల్లో అశోక్ బాబుకు చంద్రబాబు టికెట్ ఇస్తారని ఊహాగానాలు వస్తున్నాయి.