కాంగ్రెస్ పార్టీ టైం కలిసివస్తోంది. అనూహ్య రీతిలో గుజరాత్ లో పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారపీఠాన్ని కొద్ది తేడాతో మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పీఠం పోయిన బాధ కంటే...పార్టీ పెద్ద ఎత్తున బలపడిందనే సంతోషం హస్తం నేతల్లో ఉంది. దీనికి కొనసాగింపు అన్నట్లుగా...నిన్ననే 2జీ స్కామ్ నుంచి క్లీన్ గా కాంగ్రెస్ బయటపడింది. ఇదే వరుసలో ఇవాళ మరో గుడ్ న్యూస్ ను వింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ కు భారీ ఊరట లభించింది. ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ కుంభకోణంలో ఆయన్ను విచారించరాదంటూ ఇవాళ ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆదర్శ్ కేసులో మాజీ సీఎం చౌహాన్ ను విచారించాలని గవర్నర్ విద్యాసాగర్ రావు గతంలో ఇచ్చిన ఆదేశాలను ముంబై హైకోర్టు కొట్టిపారేసింది. రాజ్యాంగ నియమావళి ప్రకారం చౌహాన్ ను విచారించాలంటే రాష్ట్ర గవర్నర్ అనుమతి అవసరం. ఆదర్శ్ స్కామ్ వల్ల చౌహాన్ తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా...కార్గిల్ యుద్ధ వీరులకు ముంబైలో ఇండ్లు నిర్మించేందుకు ఆదర్శ్ హౌజింగ్ సొసైటీని ఏర్పాటు చేశారు. అయితే ఆర్మీ ఆఫీసర్లు - రాజకీయవేత్తలు - అధికారులు అక్రమంగా ఇతరులకు ఇండ్లు కేటాయించారు. ఆ కేసులో అప్పుడు సీఎంగా ఉన్న అశోక్ చౌహాన్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇదిలాఉండగా...ముంబై హైకోర్టు తీర్పు పట్ల అశోక్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. చివరకు సత్యమే జయిస్తుందన్నారు. దేశ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకు బీజేపీ ఇలా వ్యవహరిచిందని ఆరోపించారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగిందని..తాము చేసిన వాదనే నిజమని తేలిందన్నారు.