హౌ ‘డియర్’ యు?

Update: 2016-06-15 06:59 GMT
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ - బీహార్ విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరిల మధ్య ట్విట్టర్ వేదికగా సాగిన ఘర్షణ దేశమంతా చర్చనీయాంశమవుతోంది.  ‘డియర్‌’ అన్న సంబోధన ఇద్దరి మధ్య యుద్ధానికి కారణమైంది. కేంద్ర మంత్రికి - బీహార్‌ మంత్రికి మధ్య గొడవ పెట్టిన డియర్ పదం వాడకంపై ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది.  కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైందని, కేంద్రం ప్రకటించిన నూతన విద్యా విధానానికి సంబం ధించి వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారని ప్రశ్నిస్తూ బీహార్‌ విద్యా శాఖ మంత్రి అశోక్‌ చౌదరి కేంద్రమంత్రి స్మృతిని ట్విట్టర్‌ లో నిన్న ప్రశ్నించారు.

అయితే.. ఈ సందర్భంగా ఆయన మంత్రిని డియర్‌ అని సంబోధించారు. ‘‘డియర్ స్మృతి ఇరానీ గారూ.. నూతన విద్యావిధానం ఎప్పుడు వస్తుంది? మీ క్యాలెండర్‌లో 2015వ సంవత్స రం ఎప్పుడు పూర్తవుతుంద’ని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను డియర్‌ అని సంబోధించడం మర్యాద కాదని తిరిగి ట్వీట్‌ చేశారు.  ‘మీరు మహిళలను ‘డియర్’ అని పిలవడం ఎప్పట్నుంచి మొదలుపెట్టారు’ అని అడిగారు. చౌదరి అందుకు బదులిస్తూ.. ప్రొఫెషనల్ ఈ-మెయిల్స్‌ పంపేటపుడు మొదట ‘డియర్’ అని రాస్తారు. నేనేమి అగౌరవంగా రాయలేదు..’ అని ట్విట్టర్ లోనే బదులిచ్చారు.  స్మృతి స్పందిస్తూ.. బిహార్‌ లో క్షేత్రస్థాయిలో విద్యావిధాన ప్రణాళిక అమలు కాలేదని - రాష్ట్రంలో 2 లక్షల టీచర్ల పోస్టుల భర్తీ - కేంద్రీయ విద్యాలయాలకు భూకేటాయిపుపై మీ ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని ఆయనకు రాజకీయంగా కౌంటర్ ఇచ్చారు.

అయితే.. ఇద్దరు నేతల మధ్య ట్వీట్ల యుద్ధం అక్కడకు ముగిసినా నెటిజన్లు మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కేంద్రమంత్రి.. అందునా మహిళను పట్టుకుని సోషల్ మీడియాలో అలా డియర్ అని సంబోధించడం కరెక్టు కాదని కొందరు వాదిస్తుండగా ఇంకొందరు మాత్రం  డియర్ అనే సంబోధన ప్రొఫెషనల్ వర్డింగు అయిందని.. స్మృతి ఇరానీ ప్రొఫెషనల్‌ గా ఉండడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు.

కాగా జేడీయూ పార్టీకి చెందిన అశోక్ చౌదరి వ్యవహారాన్ని స్మృతి ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనను అగౌరవపరిచేలా సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడారని కంప్లయింట్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఇద్దరి మధ్య వివాదంపై అటు బీజేపీ కానీ, ఇటు జేడీయూ కానీ ఇంతవరకు స్పందించలేదు.
Tags:    

Similar News