జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభిమానులు ఊహించని వార్త. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేవం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సన్నిహితుడనే పేరున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పవర్ స్టార్ గురించి లైట్ తీసుకునే కామెంట్లు చేశారు. మీడియాతో అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి కాలంలో పవన్ పలు అంశాలపై ట్వీట్ లు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ``పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు. అతను సినిమా నటుడంటా! నేను సినిమాలు చూసి 20 ఏళ్లయింది`` అని ఎద్దేవా చేశారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన టీటీడీ ఈఓ ఎంపికపై స్పందించనని అశోక్ గజపతిరాజు తెలిపారు. కాగా సౌమ్యుడిగా పేరున్న అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలు ఇటు టీడీపీలో అటు జనసేన వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
మరోవైపు టీటీడీ ఈఓ ఎంపికను తప్పుపడుతూ ఉత్తరాది-దక్షిణాది వ్యాఖ్యలు చేసిన పవన్ తీరును సీపీఐ జాతీయ నేత నారాయణ తప్పుపట్టారు.
టీటీడీ ఈఓ నియామకాన్ని వివాదం చేయడం తగదని అన్నారు. సివిల్ సర్వీస్ అధికారులకు ఎక్కడైనా బాధ్యతలు ఇవ్వొచ్చని తెలిపారు. ఈ విషయం తెలియకుండా ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని అన్నారు.