కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రాజు సాధారణంగా ఎవరిపైనా ఊరికే విమర్శలు చేయరు. ఆయనకు కోపం తెప్పిస్తే మాత్రం ఆగ్రహంతో ఊగిపోతారు. అలాంటి సమయంలో కూడా వ్యక్తిగతంగా కించపరిచేలా వ్యాఖ్యలేమీ చేయరు. ఆయన కోపం, విమర్శలు కూడా హుందాగానే ఉంటాయి. తాజాగా మాత్రం ఆయన తన సహజ శైలికి భిన్నంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై మండిపడ్డారు. తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. రాహుల్ ను పిల్లాడితో పోల్చారు.
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీవి కుర్రచేష్టలని అశోక్ గజపతిరాజు విమర్శించారు. కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీకి చంద్రబాబు ఫోబియా పట్టుకుందని, చంద్రబాబు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే ఎలా దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసని, రాష్ట్ర పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ నేతలను ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు కనుకనే ప్యాకేజ్ ఇచ్చారని అన్నారు.
కాగా 'హోదాకు భరోసా’ పేరిట గుంటూరులో జరిగిన సభలో సీఎం చంద్రబాబుపై రాహుల్ గాంధీ చేసిన ఘాటు వ్యాఖ్యలకు స్పందనగానే అశోక్ ఈ విమర్శలు చేసినట్లు చెప్తున్నారు. ప్రధాని మోదీకి చంద్రబాబు భయపడుతుండటం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడగటం లేదని రాహుల్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ అశోక్ ఇలా ఫైరయ్యారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/