వీళ్లంతా శోక నాయ‌కులు

Update: 2015-09-22 10:23 GMT
ప్ర‌జ‌ల క‌న్నీళ్లు తుడవాల్సిన ఓ నాయ‌కుడు తానే ఏడ్చుకున్నాడు. ఎన్నిక‌ల వేళ టికెట్ రాక‌పోవ‌డంతో దుఃఖం పొంగుకొచ్చి బోరుమంటూ క‌న్నీళ్లు కార్చాడు. బాబ్బాబూ!!! ద‌య‌చేసి నాకు టికెట్ ఇప్పించండంటూ త‌మ అధినేత‌ల‌ను కాళ్లావేళ్లాప‌డి బ‌తిమ‌లాడాడు. ఈ సీనంతా తాజాగా ఎన్నిక‌ల జ‌ర‌గున్న‌ బీహార్ రాష్ట్రంలో జ‌రిగింది. ఎలక్షన్లలో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి విప‌ల‌మైన ఆ నాయ‌కుడు ఆశాభంగాన్ని త‌ట్టుకోలేక‌.. ఉన్న‌ఫ‌ళంగా ఏడ్చేసి అధినేత‌ల‌ను కంగారుపెట్టేశాడు.  బీహార్ కు చెందిన ఈ ఆర్ ఎస్ ఎల్ పి లీడర్ అశోక్ గుప్తా త‌మ అధినేత కుష్వాహా ఎదుట పాట్నాలో శోకాలు పెట్టాడు. అంతేకాదు.. టికెట్ కోసం డబ్బులిచ్చాన‌ని... అదంతా గంగ‌పాలైంద‌ని గ‌గ్గోలు పెడుతున్నాడు.

ఇలాంటి టికెట్ నిరాక‌ర‌న ఉదంతాలు అన్ని పార్టీల్లో ఉన్నా గుప్తాలా ఎవ‌రూ హైడ్రామా మాత్రం క్రియేట్ చేయ‌లేక‌పోయారు. అన్నిపార్టీల్లోని అనేకమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆయా పార్టీలు టిక్కెట్లు నిరాకరించాయి. ఇప్పటికే బీజేపీ ప్రకటించిన తొలి మూడు జాబితాల్లో 20మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు రాలేదు. జనతాదళ్ యునైటెడ్ కు చెందిన 39మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దొర‌క‌లేదు. వీరిలో 18మంది పార్టీకి వ్యతిరేకంగా ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆర్జేడీలోనూ ఇదే పరిస్థితి. ఆర్జేడీ అధినేత లాలూ చిన్న‌ల్లుడు  కూడా ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌బోతున్నారు. ఆయ‌న ములాయం మ‌నుమ‌డు కావ‌డంతో రాజ‌కీయ పొత్తుల విఫ‌ల‌మై సొంత మామ లాలూకు వ్య‌తిరేకంగా వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు రామ్ విలాస్ పాశ్వాన్ అల్లుడు అనిల్ కుమార్ సాధుకు కూడా ఇంత‌కుముందే టిక్కెట్ దొర‌క‌లేదు... ఆయ‌న కూడా ఆ సంద‌ర్భంలో బోరుబోరున విల‌పించ‌డం దేశ‌మంతా చూసింది.

ఇలా టికెట్లు రాలేద‌ని ఏడ్చుకుంటున్న ఈ నేత‌లు ప్ర‌జ‌ల క‌న్నీళ్లెలా తుడుస్తారో... ధైర్య‌వ‌చ‌నాలెలా చెబుతారో వారికే తెలియాలి మ‌రి.
Tags:    

Similar News