హిందుత్వ ఫైర్ బ్రాండ్ గా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేతగా.. విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ పరిస్థితి సీరియస్ గా ఉంది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని చెబుతున్నారు.
నెల రోజుల నుంచి ఆయన తీవ్ర ఆనారోగ్యంతో ఉన్నారు. దసరా సందర్భంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అలహాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న పూజలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనకు ఊపిరి ఆడటం లేదంటూ కుప్పకూలిపోయారు. వెనువెంటనే ఆయన్ను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
నాటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. సింఘాల్ ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సింఘాల్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన్ను పరామర్శించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆసుపత్రికి వచ్చారు. ఆయన్ను పరామర్శించారు. సింఘాల్ ఆరోగ్య పరిస్థితిపై హిందుత్వ సంస్థలు ఆందోళన పడుతున్నాయి.