నగ్నంగా చాట్ చేయమంది.. తర్వాత షాకిచ్చింది

Update: 2022-04-04 09:49 GMT
'హాయ్ ఐయామ్ నిధి. వయసు 22. మీతో ఫ్రెండ్ షిప్, డేటింగ్, చాటింగ్ కు సిద్ధం.. కావాలనుకుంటే ఈ నంబర్ కు కాల్ చేయండి' అంటూ ఒక తెలియని ఫోన్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఆశపడి సొల్లు కార్చి చేశారో ఇక అంతే సంగతులు. ఇప్పుడు ఈ కొత్తరకం మెసేజ్ లు ఫోన్లకు వచ్చిపడుతున్నాయి. యువకులను, ఆడవారి బలహీనతలను ఉన్న వారిని వీరు ఇట్టే మోసం చేస్తున్నారు. డబ్బు పోవడమే కాదు.. పరువును నడిబజారులో నిలబెట్టేలా అసలు ఆ తర్వాత మొదలవుతుంది.

ముంబైలో ఓ మహిళ యువకుడికి ఊహించని షాక్ ఇచ్చింది. అంధేరి ఈస్ట్ లో ఎంబీఏ చదువుతున్న యువకుడు.. 'హింజ్' అనే డేటింగ్ యాప్ లో ఓ మహిళతో చాట్ చేశాడు. నగ్నంగా ఉన్న ఆమె, అతడిని కూడా నగ్నంగా చాట్ చేయమంది. అలాగే చేశాడు. ఆ రాత్రి ఆ వ్యక్తి వాట్సాప్ కు ఆమెతో నగ్నం చాట్ చేసిన వీడియో వచ్చింది.

 ఆమె తన నగ్న వీడియోలను వ్యక్తికి చూపించింది. బాధితుడిని కూడా నగ్నంగా ఉన్న వీడియోలు పెట్టాలని చెప్పింది. దీంతో అతడూ అలాగే చేశాడు. కాసేపటి తర్వాత ఆ వీడియోను వాట్సాప్ లో షేర్ చేసి.. మీ అమ్మానాన్నలకు చూపిస్తానని.. సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరింపుల ఆ యువతి పాల్పడింది.

రూ.10వేలు గూగుల్ పే చెయ్యకుంటే పేరంట్స్ కు వీడియో ఫార్వర్డ్ చేస్తానని ఆమె బెదిరించింది. దీంతో షాక్ అయిన ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు

ఈ ముఠా వలలో  డేటింగ్ మెసేజ్ అంటూ పంపితే స్పందించిన పాపానికి  ముంబై  వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. అమ్మాయిల కనిపించేసరికి సొల్లు కార్చుకుంటూ మొత్తం బట్టలన్నీ విప్పి ఇప్పుడు ఆ యువకుడు బుక్కై పోయాడు.  

పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  అతనిచ్చిన ఆధారాలతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.ఇలాంటి మాయలేడీల వలలో పడవద్దని సూచిస్తున్నారు.
Tags:    

Similar News