అసద్ కారుపై కాల్పులు.. ఆ తర్వాతేమైంది?

Update: 2022-02-04 02:11 GMT
యూపీ ఎన్నికల ప్రచార వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మజ్లిస్ అధినేత కమ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పలు జరిపిన ఉదంతం సంచలనంగా మారింది. యూపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థుల తరఫు ప్రచారం చేస్తున్న వేళ.. ఆయన ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరగటం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఈ ఉదంతం నుంచి అసద్ క్షేమంగా బయటపడ్డారు.

తాను ఛిజారసీ టోల్ గేట్ సమీపానికి చేరుకునే వేళలో గుర్తు తెలియని వారు నాలుగు రౌండ్లు కాల్పలు జరిపినట్లుగా అసద్ పేర్కొన్నారు. తన కారుకు పంక్చర్ కావటంతో పాటు.. కారు స్వల్పంగా దెబ్బ తిన్నట్లు పేర్కొన్నారు. ఈ ఉదంతంలో ముగ్గురు లేదంటే నలుగురు వ్యక్తులకు సంబంధం ఉందని పేర్కొన్నారు. తామంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటన జరిగిన కాసేపటికి వేరే కారులో ఆయన వెళ్లిపోయారు. తన మీద జరిగిన దాడిపై ఆయన ఎవరి మీదా అనుమానాలు వ్యక్తం చేయలేదు.

తన వాహనంపై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోల్ని.. వివరాల్ని అసద్ తన సోషల్ మీడియా పంచుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. అసద్ పై దాడి జరిగిన వేళ.. సోషల్ మీడియా.. వాట్సాప్ లు రోటీన్ కు భిన్నంగా రియాక్టు కావటం గమనార్హం. సాధారణంగా నేత ఎవరైనా.. వారిపై గుర్తు తెలియని దాడికి పాల్పడిన వెంటనే సానుభూతి వెల్లువెత్తుతుంది. కానీ.. అసద్ విషయంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది.

యూపీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళలో కాల్పులు జరగటంపైన నెటిజన్లు స్పందించిన వైనం షాకింగ్ గా మారింది. మొత్తంగా.. ఈ ఉదంతం యూపీ ఎన్నికల ప్రచారంపైనా.. తుది ఫలితాల మీదా ప్రభావం ఉంటుందన్న రీతిలో చర్చలు జరుగుతున్నాయి. ఏమైనా.. ఈ ఉదంతం షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News