ప్రియుడి హెచ్ఐవీ రక్తాన్ని శరీరంలోకి ఎక్కించుకున్న యువతి..

Update: 2022-08-06 05:12 GMT
వెర్రి వేయి విధాలు అంటారు. ఈరోజుల్లో కూడా ఇంత పిచ్చి ప్రేమ ఉందంటే నిజంగా విడ్డూరమే.. ఎందుకంటే.. నాలుగు నెలలు కూడా కలిసి కాపురం చేయలేని ఆధునిక భావాలు నేటి యువతలో ఉన్నాయి. కానీ యువతి మాత్రం పిచ్చిగా ప్రేమించడమే కాదు.. ప్రియుడు ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా తను ప్రాణాలు తీసుకునేందుకు రెడీ అయ్యింది.

ప్రేమ కోసం ఎంతో మంది ఎన్నో రకాల త్యాగాలు చేసేవాళ్ల గురించి మనం విన్నాం.. ప్రేమకు అడ్డువచ్చిన వారిని చంపడానికి.. లేదా వారే స్వయంగా తనువు చాలించిన వాళ్లనూ చూసి ఉంటారు. కానీ ప్రేమించిన వ్యక్తం కోసం ఏకంగా తను బలి కావడానికి రెడీ అయిన ఈ యువతి వైనం హాట్ టాపిక్ గా మారింది.  అసోంకు చెందిన ఓ యువతి హెచ్ఐవీ వైరస్ ఉన్న తన ప్రియుడి రక్తాన్ని శరీరంలోకి ఎక్కించుకుంది. అసలు ఆమె ఎందుకు అలా చేసిందనేది ఎవరికీ తెలియదు.

అసోంకు చెందిన ఓ యువతి.. తన ప్రియుడి కోసం ఎవరూ చేయని సాహసం చేసింది.  ప్రేమికుడి నుంచి ఎవరూ తనను దూరం చేయకూడదని హెచ్ఐవీ ఉన్నతన లవర్  రక్తాన్ని శరీరంలోకి ఎక్కించుకుంది. ఈ విషయం తెలిసి అందరూ అవాక్కవుతున్న పరిస్థితి నెలకొంది.

అసోంలోని కామ్ రూప్ జిల్లాలోని సువల్ కచి గ్రామానికి చెందిన ఆ యువతికి 19 పక్క గ్రామానికి చెందిన ఓ యువకుడితో మూడేళ్ల క్రితం ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.

కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో మునిగితేలారు. అయితే ఆ యువకుడు హెచ్ఐవీ వైరస్ తో పోరాడుతున్నాడు. అతి తెలిసి కూడా యువతి తన లవర్ తో మూడు సార్లు గ్రామాన్ని విడిచి పారిపోయింది. కానీ ప్రతిసారి ఆమె కుటుంబ సభ్యులు వారిని వెతికి తీసుకొచ్చారు.

ఈ యువతి సిరంజీతో తన బాయ్ ఫ్రెండ్ రక్తాన్ని తను ఎక్కించుకుంది. విషయం తెలిసిన యువతి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  బుధవారం యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం యువతికి పోలీసులు.. వైద్యపరీక్షలు చేయగా నిర్ధారణ అయ్యింది. తన ప్రేమను బతికించుకునేందుకే ఈ పని చేసినట్లు యువతి పేర్కొంది.
Tags:    

Similar News