అస్సామీ యువతులకు లవ్ జిహాద్ చేస్తే కఠినచర్యలు: మంత్రి

Update: 2020-10-15 17:33 GMT
అసోంలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఒక మతంలోని యువతలను మోసం చేసి వివాహం చేసుకుంటున్న వేరొక మతంలోని యువకులపై కఠిన చర్యలకు తీసుకుంటామని అస్సాం ప్రభుత్వం తెలిపింది.. దీని కోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హేమంత్ బిశ్వాశర్మ గురువారం గౌహతిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించారు.

లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా అసోం ప్రభుత్వం పోరాటాన్ని ప్రారంభించబోతోందని మంత్రి బిశ్వా ప్రకటించారు. తమ బిడ్డలను మోసగాళ్ల వంచన నుంచి రక్షించేందుకే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా అమాయక బాలికలు మోసపోతున్నారు. సోషల్ మీడియాలో ఒక మతం వ్యక్తి మాదిరిగా ఫేక్ అకౌంట్ ను సృష్టించి దానికి ఓ దేవుడి ఫొటోను వాల్ పేపర్ గా పెడుతున్నారని బిశ్వా వెల్లడించారు. ఈ విధంగా ఒక వర్గం అమ్మాయిలను వివాహం చేసుకోవాలనే దుర్బుద్దితో కొంత మంది యువకులు ఈ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అమాయకపు యువతులను మోసం చేసి.. ప్రేమ పేరుతో లోబరుచుకుంటున్నారని మంత్రి బిశ్వా ఆరోపించారు. అనంతరం పెద్దలకు ఇష్టం లేకున్నా దొంగచాటుగా వివాహం చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది యువతులు వారి చేతిలో మోసపోతున్నారన్నారు. అస్సామీ ఆడపడుచుల రక్షణకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి మీడియా ముఖంగా వెల్లడించారు.

బిజెపి అధికారంలోకి వస్తే లవ్ జిహాద్ అరికడితామని హామీ ఇచ్చామని.. దాన్ని అమలు చేస్తున్నామని మంత్రి బిశ్వా తెలిపారు. ఏ అబ్బాయి అయినా తన మతపరమైన గుర్తింపును దాచిపెట్టి సోషల్ మీడియాలో.. బయట అస్సామీ కుమార్తెలు మరియు మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.వారంతా క్రూరమైన మరియు కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని మంత్రి హెచ్చరించారు.

మరో వైపు బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు, కొన్ని మత వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యువతీ యువకులు ఇష్టాలకు అనుగుణంగా చేసుకున్న వివాహాన్ని రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదన్నారు.
Tags:    

Similar News