అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ దేశం, ఆదేశం అంటూ తేడా లేకుండా నోరుపారేసుకోవడమే కాదు ఆఖరికి అమెరికాలో ఉంటున్న వారిని కూడా ఆయన ఏకేస్తున్నారు. ఈ తీరుపై రకరకాల అభిప్రాయాలు వెలువడ్తున్న క్రమంలో మనదేశానికి చెందిన ప్రముఖ టీ కంపెనీ 'అస్సాం టీ' కొత్త పరిష్కారం కనిపెట్టింది. ఆయనకు 6000 గ్రీన్ టీ బ్యాగులను పంపించింది. అంతేకాదు దాంతో ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది.
రోజుకు మూడుసార్లు ట్రంప్ టీ తాగుతారని భావించి నాలుగేళ్లకు సరిపడా గ్రీన్ టీ బ్యాగులను పార్సిల్ చేసి పంపిచినట్లు కోల్‌కతాకు చెందిన అస్సాం టీ సంస్థ ప్రకటించింది. కావాలంటే మరిన్ని బ్యాగులు పంపిస్తామని తెలిపింది. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండన్న వీడియో సందేశంతో ఈ టీ బ్యాగులను పంపింది. '' డియర్ ట్రంప్ నమస్తే, మేము మీకు చాలా మొత్తంలో గ్రీన్ టీని పంపిస్తున్నాము. శరీరంలోని హానికారక క్రిములను ఇది నిర్మూలించి మెదడు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీకోసం, అమెరికా కోసం, ప్రపంచం కోసం మీరు ఈ టీ తాగండి'' అన్నది ఆ వీడియో సందేశం సారాంశం.
''ట్రంప్ మొత్తం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నారు.. అలా చేయకుండా ఆయనను ఆపలేముగానీ.. కనీసం ఆయనను మార్చగలమని భావించి ఈ విధంగా చేస్తున్నాం'' అని కూడా ఆ వీడియోలో కంపెనీ పేర్కొంది.అయితే వాటి ధర ఎంత అనేది ప్రకటించలేదు. ఇదిలాఉండగా భారత్ నుంచి వచ్చిన టీ బ్యాగులపై స్పందించడానికి ట్రంప్ సన్నిహిత వర్గాలు నిరాకరించాయి.