ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం.. కొత్త సంవత్సరంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవడం మామూలే. ఇక రాజకీయ ప్రముఖులైతే తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందా అని ఆసక్తి చూపుతారు. జ్యోతిష్కులు కూడా... రాజకీయ నేతలంటే ప్రజలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి వారి జాతకాలను చెబుతుంటారు. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కూడా ఇలా రెండు తెలుగు రాష్ర్టాల్లో రాజకీయ పరిస్థితులు ఈ ఏడాది ఎలా ఉండబోతున్నాయో చెప్పారు. ఏపీలో వైసీపీ అధినేత జగన్ కు పరిస్థితులు అత్యంత అనుకూలంగా మారుతున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలోనే నడుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పాలన మాత్రం ఇబ్బందికరంగానే ఉంటుందన్నారు.
ఈ హేవిళంబి సంవత్సరంలో రాజకీయంగా వైఎస్ జగన్ కు పరిస్థితులు అత్యంత అనుకూలంగా మారుతాయన్నారు. ఈ ఏడాది వైఎస్‌ఆర్‌సీ ట్రెండ్ కొనసాగుతుందన్నారు. వైసీపీ పాపులారిటీ ప్రజల్లో అమాంతం పెరిగిపోతుందని రామలింగేశ్వర సిద్ధాంతి వెల్లడించారు. ప్రతిపక్షనాయకుడు జగన్ జనం మనసు గెలుచుకుంటారని చెప్పారు.
ఇక పబ్లిక్ సంగతులకొస్తే.. హైదరాబాద్ లో అభివృద్ధితో పాటు గన్ కల్చర్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కొత్త ఏడాదిలో ప్రేమ వివాహాలతో పాటు ఆత్మహత్యలు పెరుగుతాయన్నారు. నీటి సమస్యలు పెరుగుతాయన్నారు. సినిమా అగ్రహీరోల అభిమానుల మధ్య అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయన్నారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుండడం.. సిద్ధాంతి అంచనాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/