సమాజంలో భక్తిని అన్నిరకాలుగా వాడుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా గుజరాత్‌కు చెందిన ఓ సన్యాసిని ఇంట్లో 80 లక్షల విలువైన 24 బంగారు కడ్డీలు, 1.2 కోట్ల విలువ ఉన్న కొత్త 2000 నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు గుజరాత్ లో మద్యనిషేధం అమల్లో ఉన్నా.. ఈమె ఇంట్లో మద్యం బాటిళ్లు దొరకడం గమనార్హం. సాధ్వి జై శ్రీ గిరిగా అక్కడివాళ్లు పిలుచుకునే ఈ సన్యాసినిని పోలీసులు అరెస్ట్ చేశారు. బనస్కాంత జిల్లాలోని ఓ గుడి ఈమె ట్రస్ట్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. గతేడాది నవంబర్ లో ఈమె ఐదు కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు కొన్నా.. ఆ బిల్లు చెల్లించలేదు. దీంతో స్థానిక బంగారు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సాధ్వి జై శ్రీ గిరి ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఆ వ్యాపారి చెప్పినట్లే బంగారు కడ్డీలు బయటపడటంతో ఆమెను అరెస్ట్ చేశారు. ముగ్గురిపై కేసులు నమోదు చేశామని, అందులో ప్రధాని నిందితురాలైన జై శ్రీ గిరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో ఈమె ఓ పబ్లిక్ ఈవెంట్ లో సింగర్లపై కోటి విలువైన 2 వేల నోట్లు విసరడం వివాదమైంది. నోట్ల రద్దు కారణంగా కొత్త నోట్లు దొరక్క జనం ఇబ్బందులు పడుతుంటే.. ఈమె మాత్రం కొత్త 2 వేల నోట్లను అలా విసరడం అనుమానాలకు తావిచ్చింది. తాజాగా ఆమె ఆక్రమ సంపాదన వెలుగులోకి వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/