మోడీ బాంబు: చెన్నై టీం లో ఆ నలుగురు!

Update: 2015-05-11 10:47 GMT
ఐపీఎల్ లో ఫిక్సింగ్ బాగా జరుగుతుంది, బెట్టింగుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంటూ ఈ మధ్యకాలంలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి! మ్యాచ్ మ్యచ్ కి వేల కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయని, ఐపీఎల్ అధికారుల హస్తం కూడా వీటిలో ఉంటుందని వార్తలు గుప్పుమంటున్నాయి!! అయితే ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్) మాజీ కమిషనర్ లలిత్ మోడీ బెట్టింగులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ లో ఐపీఎల్ లో జరుగుతున్న తాజా పరిస్థితులు ఇవి అంటూ వరుస ట్వీట్లు చేశాడు!

ఐపీఎల్ గేం ల పైన పెద్దమొత్తంలో బెట్టింగులు జరుగుతున్నాయని ఆరోపించిన లలిత్ మోడీ... ఇందులో చైన్నై సూపర్ కింగ్స్ పాత్ర కూడా ప్రముఖంగా ఉందని పెద్ద బాంబే పేల్చాడు! తక్కువలో తక్కువగా కనీసం నలుగురు చెన్నై ఆటగాళ్లు ఫిక్సింగ్‌లో ఉండి ఉంటారని మోడీ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు! ఆ నలుగురిలో జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు! వీరందరి సౌజన్యంతో ఒక్కో ఐపీఎల్ ఆటకు తొమ్మిది నుండి పదివేల కోట్ల రూపాయల వరకూ బెట్టింగులు జరుగుతున్నాయని లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు!
Tags:    

Similar News