దేశంలో వ్యాక్సిన్ డ్రైవ్ చాలా నత్తనడకన సాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 130 కోట్ల జనాభా ఉంటే.. ఇప్పటి వరకూ కేవలం 15 కోట్ల పైచిలుకు మందికి మాత్రమే టీకా అందినట్టు సమాచారం. చాలా మంది టీకా కేంద్రాలకు రెండు నుంచి మూడు సార్లు తిరిగినా.. టీకా వేయట్లేదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధార్థ్ పైవిధంగా ట్వీట్ చేశారు.
కొవిడ్ నేపథ్యంలో దేశం అల్లకల్లోలమైన వేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందేని బహిరంగంగానే నిరసిస్తున్నారు సిద్ధార్థ్. ఈ మేరకు వరుస ట్వీట్లు చేస్తున్నారు. దేశంలోని పరిస్థితిని హారర్ స్టోరీగా అభివర్ణించిన ఆయన.. సెలబ్రిటీస్ మౌనంగా వేడుక చూడడం సరికాదని అన్నారు. కనీసం ప్రజలైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు.
మరో ట్వీట్లో.. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. దీంతో.. తనను చంపేస్తామని వరుసగా దాదాపు 500 మంది ఫోన్ కాల్స్ వచ్చాయని, తన కుటుంబ సభ్యులను రేప్ చేస్తామని కూడా బెదిరించారని సిద్ధార్థ్ ట్వీట్ చేయడం కలకం రేపింది. అయితే.. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. సిద్ధార్థ్ ను బెదిరించిన వారిలో బీజేపీ కార్యకర్తలు ఎవరూ లేరని చెప్పారు ఆ పార్టీ నేతలు.