ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. దేశ పాలనాపగ్గాలు చేపట్టిన 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన ఎలాంటి సంక్లిష్ట పరిస్థితినీ ఎదుర్కొనలేదు. పైగా.. ఆయన సర్జికల్ స్ట్రైక్ అని.. మరొకటని.. విజయాలు చాటుకున్నారే తప్ప.. ఇటు.. దేశ ప్రజల నుంచి నిపుణుల నుంచి ఎన్నడూ.. పెద్దగా విమర్శలు. నిందలు మోసింది లేదు. కానీ, ఇప్పుడు మాత్రం.. మోడీ సెంట్రిక్‌గా ముప్పేట దాడి జరుగుతోంది. ఆయన వ్యవహార శైలిపై తీవ్రదుమారం రేగుతోంది.
ప్రధానంగా కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న నేపథ్యంలో ప్రధానికి ముందు చూపులేదా? కరోనాను నియంత్రించే పరిస్థితి లేదా? అంటూ.. నిత్యం విమర్శలు జోరందుకున్నాయి. కొందరైతే.. ఏకంగా ట్విట్టర్ వేదికగా.. ప్రధానిని రాజీనామా చేయాలంటూ.. డిమాండ్లు చేస్తుండడం గమనార్హం. దీంతో మోడీ.. ఇన్నేళ్లలో లేని విధంగా ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే.. ప్రస్తుతం మోడీ ఎదుర్కొంటున్న ఈ దుస్థితికి జ్యోతిష్యులు పలు కారణాలుచెబుతున్నారు.
ప్రస్తుతం మోడీ జాతకం ఏమీ బాగోలేదని, గ్రహస్థితి అననుకూలంగా ఉందని.. అందుకే ఆయన ఈ పరిస్థి తిని ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఈ జ్యోతిష్యుల అంచనా ప్రకారం.. ఈ ఏడాది నవంబరు వరకు కూడా పాలకుడుగా ఉన్న మోడీపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహం తప్పదని చెబుతున్నారు.
మరికొందరు జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే.. 2023 వరకు బీజేపీ పరిస్థితి ఇంతేనని.. పార్టీ స్థాపన తర్వాత.. ఎదుర్కొనని అనేక పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందని అంటున్నారు. ఇదిలావుంటే.. బీజేపీ నాయకుల వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బ్యాడ్ పిరియడ్.. వచ్చే 2024 ఎన్నికల నాటికి పోతుందని లెక్కలు గడుతున్నారు. సో.. ఇదే కనుక(మోడీ/బీజేపీ టైం బ్యాడ్) నిజమైతే.. గతంలో ఆయన వల్లెవేసిన జమిలి ఎన్నికల జోలికి పోబోరని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.