వాజ్ పేయి చితాభ‌స్మంతో బీజేపీ రాజ‌కీయం!

Update: 2018-08-20 06:05 GMT
అన్నింటిని రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌కు వాడుకోవ‌టం స‌రికాదు. గ‌తంలో అయితే.. కొన్ని నిర్ణ‌యాల వెనుక అస‌లు విష‌యాన్ని ప్ర‌స్తావించే మీడియా సంస్థ‌లు పెద్ద‌గా ఉండేవి కావు. కొన్ని అంశాల్ని అస్స‌లు ట‌చ్ చేయ‌కుండా ఉండ‌కుండా సెన్సార్ చేసేవారు. దానికి ఒక్కొక్క‌ళ్లు ఒక్కో పేరు పెట్టుకునే వారు. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు.

సోష‌ల్ మీడియా సీన్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఏ విష‌యాన్ని ఎవ‌రూ దాచ‌లేని ప‌రిస్థితి. ఒక‌వేళ దాచినా.. ఆ విష‌యాన్ని కూడా బ‌య‌టకు వ‌చ్చేస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సోష‌ల్ మీడియా సీన్లో లేన‌ప్పుడు మీడియా స‌మాచారం కోట్లాది మందిని ప్ర‌భావితం చేసేది. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయి..కోట్లాది మంది మాట‌ల‌కు మీడియా ప్ర‌భావితం కావాల్సి వ‌స్తోంది. ఒక సామాన్యుడు సైతం వార్తాంశంగా మార‌ట‌మే కాదు.. రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసే ప‌రిస్థితిని సోష‌ల్ మీడియా తీసుకొచ్చింద‌ని చెప్పాలి.

ఇదంతా ఎందుకంటే.. తాజాగా భార‌త రాజ‌కీయ‌ శిఖ‌ర స‌మానుడైన వాజ్ పేయి చితాభ‌స్మాన్ని పుణ్య న‌దుల్లో క‌లిపే అంశంపై బీజేపీ తొలుత అనుకున్న నిర్ణ‌యానికి భిన్న‌మైన నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. గంగ‌తో పాటు.. మ‌రికొన్ని ముఖ్య న‌దుల్లో చితాభ‌స్మాన్ని క‌ల‌పాల‌ని భావించారు.

అయితే.. అరుదుగా వ‌చ్చే అవ‌కాశాన్ని స‌రైన రీతిలో వాడుకోకపోవ‌టం ఏమిట‌న్న చ‌ర్చ‌తో వాజ్ పేయి చితాభ‌స్మాన్ని భావోద్వేగ రాజ‌కీయాల‌కు వీలుగా భారీ ప్లాన్ వేశార‌న్న మాట వినిపిస్తోంది. తొలుత 18 పుణ్య న‌దుల్లో చితాభ‌స్మాన్ని క‌ల‌పాల‌న్న నిర్ణ‌యానికి బ‌దులుగా తాజాగా మాత్రం దేశ వ్యాప్తంగా ఉన్న 100 న‌దుల్లో చితాభ‌స్మాన్ని క‌ల‌పాల‌న్న నిర్ణ‌యం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

బీజేపీ ముఖ్యులు తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం వాజ్ పేయి చితాభ‌స్మాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాలు.. ఏడు కేంద్ర‌పాలిత ప్రాంతాల్లోని న‌దుల్లో క‌ల‌పాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. త‌ద్వారా.. భావోద్వేగ రాజ‌కీయాల‌కు అవ‌కాశం ఉండేలా ప్లాన్ చేసిన‌ట్లు చెబుతున్నారు. కొన్ని ప‌నుల్ని మ‌న‌సుకు న‌చ్చిన‌ట్లుగా చేయాలే కానీ.. ప్లాన్ చేసుకొని చేస్తే మొద‌టికే మోసం వ‌చ్చే ప‌రిస్థితి. వాజ్ పేయి చితాభ‌స్మాన్ని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం బీజేపీ ప్లాన్ చేస్తే.. అందుకు త‌గ్గ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.


Tags:    

Similar News