సినిమా హీరోలు, వారి అభిమానులపై ద్వేషం ప్రదర్శించవద్దని, వారిని ట్రోల్స్ చేయవద్దని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఇలాంటి విషయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్‌లో పడొద్దని హితవు పలికారు. టీడీపీలో అన్ని మతాలు, కులాలు, ప్రాంతాల వారు ఉన్నారని గుర్తు చేశారు. అలాగే వేర్వేరు ప్రఖ్యాత వ్యక్తుల, నటుల అభిమానులు కూడా ఉన్నారని తెలిపారు. ఒక పార్టీగా, మన ప్రధాన పోరాటం ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రభుత్వం చేసే అరాచకాలపై మాత్రమే ఉండాలన్నారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
అచ్చెన్నాయుడు తాజా ట్వీట్ ఇలా ఉంది... పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లకు విజ్ఞప్తి. ఐప్యాక్, బ్లూ మీడియా ట్రాప్ లో పడకండి. తెలుగుదేశం పార్టీ అందరిదీ. మన పార్టీలో అన్ని మతాల వారు, కులాల వారు, ప్రాంతాల వారు, అదే విధంగా వేర్వేరు ప్రఖ్యాత వ్యక్తుల, నటుల అభిమానులు కూడా ఉంటారు.
ఒక పార్టీగా, మన ప్రధాన పోరాటం ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రభుత్వం చేసే అరాచకాలపై. అదే విధంగా ప్రభుత్వం వల్ల ఇబ్బందులకు గురైన బాధితులకు అండగా నిలబడడం మన కర్తవ్యం. మన పోరాటం వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో.. ఈ ప్రస్థానంలో మనమంతా, మన దృష్టి అంతా లక్ష్యం పైనే ఉండాలి.
హీరోల గురించి, వారి అభిమానుల గురించి వెటకారం, ద్వేషంతో కూడిన మాటలు మాట్లాడటం కానీ, పోస్టులు చేయడం గానీ చేయవద్దు. అలా చేసి మన పార్టీలోని కొందరు మనోభావాలను గానీ, వ్యక్తిగతంగా ఆయా వ్యక్తులను, హీరోలను అభిమానించే అభిమానుల మనోభావాలను గానీ గాయపర్చవద్దు.
హీరోల, వారి అభిమానుల వివాదాల్లోకి దూరకుండా, తద్వారా మన వైరిపక్షానికి లాభం చేకూర్చకుండా సుశిక్షితులైన సైనికుల వలే మనందరి ఉమ్మడి లక్ష్యం అయిన ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం కలిసికట్టుగా పోరాడదాం. పార్టీలోని అందరి అభిప్రాయాలను గౌరవించుదాం అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమా విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఒరిజినల్ మాతృక అయిన లూసిఫర్‌తో పోల్చిచూడటం.. అలాగే ఒరిజినల్ చిరంజీవి పోషించిన క్యారెక్టర్ చేసిన మోహన్‌లాల్‌తో పోల్చి కొందరు చేస్తున్న ట్రోలింగ్‌పైనే అచ్చెన్నాయుడు స్పందించారని చర్చ జరుగుతోంది. ప్రధానంగా టీడీపీ అభిమానులు అంటే బాలకృష్ణను అభిమానిస్తుంటారు. వారు ఎవరైనా చిరంజీవిని ట్రోల్ చేస్తూ పోస్టులు పెడితే టీడీపీకి నష్టమనే భావనలోనే అచ్చెన్న తన తాజా ట్వీట్‌లో టీడీపీ కార్యకర్తలకు ఈ సూచనలు చేసి ఉంటారని చెప్పుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.