ఆ లేఖ అచ్చెన్న కొంప ముంచిందా?

Update: 2020-06-12 11:30 GMT
ఏపీలో సంచలనం సృష్టించిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ కేసులో ఒక లేఖనే కీలకంగా మారినట్టు అధికారవర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ఏసీబీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు విజయవాడకు తీసుకొస్తోంది.

దర్యాప్తులో భాగంగా 988.77 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోలులో 150 కోట్లపైనే అవినీతి అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.

అయితే అచ్చెన్నాయుడు ఈ స్కాంలో ఇరకడానికి ప్రధాన కారణం ఒక లేఖ అని సమాచారం. అప్పటి కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఆదేశాలతో టెలీహెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాల్ సెంటర్, టోల్ ఫ్రీ , ఈసీజీ కాంట్రాక్ట్ చేసుకున్నారు.

అయితే ఈ కాంట్రాక్ట్ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఓ లేఖ కూడా రాశారు. తర్వాత అప్పటి ఐఎంఎస్ డైరెక్టర్ అయిన సీకే రమేశ్ కుమార్ ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని తేలింది. మంత్రి హోదాలో అచ్చెన్న రాసిన లేఖ ఆయన్ను ఇబ్బందుల్లో పడేసిందనే చర్చ మొదలైంది.
Tags:    

Similar News