ఏపీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడి తీరుపై ఆయన సొంత జిల్లా శ్రీకాకుళంలో టీడీపీ నేతలు, శ్రేణులు... ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.... గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో శ్రీకాకుళం జిల్లా నుంచి రాష్ట్రంలో కీలక మంత్రిగా ఉంటూ చక్రంతిప్పి తన ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ధర్మాన ప్రసాదరావు దారిలోనే అచ్చెన్న కూడా నడుస్తున్నారని ఆ జిల్లా ప్రజలు, టీడీపీ నేతలు అంటున్నారు. ధర్మాన హయాంలోని పదేళ్లలో ఆ జిల్లా అభివృద్ధి పరంగా అంగుళం కూడా ముందడుగు వేయకపోయినా ధర్మానకు అనుచరులుగా ఉన్న అధికారులు, రౌడీషీటర్లు మాత్రం మాత్రం భారీగా లాభపడ్డారు. కోట్లకు పడగలెత్తారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారిని పాతాళానికి తొక్కేశారు. ఇప్పుడు అచ్చెన్న తీరూ అదేమాదిరిగా ఉందని తెలుస్తోంది. ధర్మానలా అవినీతికి తెరతీయకపోయినా తన, పర తేడాలు చూపుతూ అచ్చెన్న చాలా చేస్తున్నారని చెప్పుకొంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అచ్చెన్నపై రగిలిపోతున్నారట.
అధికారుల్లో ఏ ఎండకా గొడుగు పట్టేవారు కొందరుంటారు. అలాంటివారు ఇప్పటికే అచ్చెన్న పంచన చేరిపోయారు. గత ప్రభుత్వ హయాంలో ధర్మానకు ముఖ్య అనుచరుడిగా ఉన్న రెవెన్యూ శాఖలోని అధికారి ఒకరు మంత్రి మారగానే ప్లేటు మార్చేశారు. ధర్మానకు కన్నెధార కొండ విషయంలో అనుకూలంగా నివేదికలు ఇచ్చిన ఆయన ధర్మాన నుంచి భారీగా లాభపడ్డారు కూడా. కోట్ల రూపాయల విలువైన స్థలాలను బహుమతులుగా అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకే చెందిన ఆ అధికారిని నిజానికి అదే జిల్లాలో ఉంచడానికి వీల్లేదు... కానీ, ఇప్పుడు ఆ జిల్లాలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇప్పుడు అచ్చెన్నాయుడి టీంలో ముఖ్య అధికారి. చాలాకాలంగా టీడీపీ, అచ్చెన్నాయుడికి అనుకూలంగా ఉన్న అధికారులు ఎలాగూ ఉన్నారు... వారందరినీ ఇప్పుడు మంత్రి మంచిగా చూసుకుంటున్నారు. అయితే... తనకు గతం నుంచి ఏమాత్రం పడని వారిని మాత్రం జిల్లాలో కనిపించకుండా శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారట మంత్రి అచ్చెన్న. దీంతో అధికారులంతా ఆయన్ను చూసి వణుకుతున్నారు.
అయితే... ఇంతచేసినా సొంత జిల్లాకు ఏమైనా చేస్తేనే ప్రయోజనం.. కానీ, అచ్చెన్న వైపు నుంచి అలాంటి చొరవే లేదు. పెద్దనోటితో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేయడంలో ముందుంటున్నా అభివృద్ధి పరంగా మాత్రం ఆయన చేస్తున్నదేమీలేదు. మరోవైపు ఆ జిల్లా ఎమ్మెల్యేలంతా అచ్చెన్నకు వ్యతిరేకంగానే ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా సీనియర్ ఎమ్మెల్యే గౌతు శివాజీ అయితే అచ్చెన్న విధానాలను బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్.... సీనియర్ నేత కళావెంకటరావులు అచ్చెన్నను తీవ్ర వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. దీంతో అభివృద్ధి చేయకపోయినా ఫర్వాలేదు అచ్చెన్న మరో ధర్మాన కాకుండా ఉంటే చాలని అంతా కోరుకుంటున్నారు.