సీఎం జగన్ - ఎమ్మెల్యే ఆర్కేపై అట్రాసిటీ కేసు: అమరావతి దళిత జేఏసీ డిసైడ్
ఏపీ రాజధాని అమరావతిలో భూకుంభకోణం కేసులు, అసైన్డ్ భూముల వివాదానికి సంబంధించి సంచలన పరిణామం చోటుచేసుకుంది. అమరావతికి సంబంధించి ఏ జీవోను ప్రస్తావిస్తూ అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం జగన్ పై అసైన్డ్, దళిత రైతులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే దళిత రైతులను మోసం చేశారంటూ చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై ఎమ్మెల్యే ఆర్కే సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.
తాజాగా మంగళవారం మరోసారి అమరావతి దళిత జేఏసీ ఆధ్వర్యంలో అసైన్డ్, దళిత రైతులు సమావేశమై సంచలన తీర్మానాన్ని ఆమోదించారు.ఈ క్రమంలోనే అమరావతి దళిత జేఏసీ మంగళవారం సమావేశమై ముఖ్యమంత్రి జగన్, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేలపైనా ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టాలని తీర్మానించుకుంది.