దారుణం: చంపి పాతేయడం ఎలా..గూగుల్ లో సెర్చ్ చేసి భర్తని .. ఏం జరిగిందంటే ?
ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ, ఆ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు గూగుల్ సాయం తీసుకుంది. ఎలా చంపాలి, ఆ తర్వాత ఎలా తప్పించుకోవాలి అనే విషయాలపై 15 గంటలు ఏకధాటిగా సెర్చ్ చేసింది. భర్తను చంపేశాక, ఏం తెలియని అమాయకురాలిగా నాటకం ఆడింది. అయితే ఫోన్ లో గూగుల్ హిస్టరీ ద్వారానే చివరికి ఆమె దొరికిపోవడం ఈ కేసులో అసలు ట్విస్ట్.. హద్రా జిల్లా ఖేడిపూర్ ప్రాంతంలో జూన్ 18న ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే .. హద్రా జిల్లా ఖేడిపూర్ ప్రాంతంలో ఆమీర్ మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. భర్త దూరంగా ఉండడంతో అదే ఏరియాలో ఉంటున్న మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అతని భార్య టబస్సుమ్. వివాహేతర సంబంధినికి అడ్డు వస్తున్నాడని తన భర్తను చంపేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ప్రభావంతో పని లేకపోవడంతో అమీర్ ఓ రోజు ఇంటికి వచ్చేశాడు. ఆమె భర్త ఇటీవల కాలంలో ఇంటి వద్దే ఉండటంతో తబుస్సుమ్‌కు ఇబ్బందిగా మారింది. ఓ రోజు ఆమె అమీర్ ను హత్య చేయడం కోసం ఒకరోజంతా గూగుల్ లో హత్య ఎలా చేయాలి.. మృత దేహాన్ని ఎలా వదిలించుకోవాలి.. ఎవరి కంట పడకుండా పాతేయడం, ఆధారాలు దొరక్కుండా తప్పించుకోవడం ఎలా, అనే విషయాల గురించి గూగుల్ లో వెతికింది.
దాదాపుగా 15 గంటలు ఏకధాటిగా సెర్చ్ చేసింది. ఈ క్రమంలో అతడిని అడ్డు తొలగించుకునేందుకు ఆమె ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఆమె భర్తకు అంతక ముందే అస్తమా ఉంది. దీంతో అతడు రోజు అస్తమా మందులు వాడుతాడు. దీనిని ఆసరా చేసుకొని ఆమె ఓ రోజు అస్తమా మందుల్ని మార్చేసింది. వాటి స్థానంలో నకిలీ మందులు అతడికి ఇచ్చింది. దీంతో అతడు సోయి లేకుండా పడిపోయాడు. ఇక ప్రియుడు ఇర్ఫాన్‌ను అదే రాత్రి ఇంటికి పిలిపించుకుంది. అమీర్ కాళ్లు చేతుల్ని స్కార్ఫ్ లతో కట్టేసి, ఆపై సుత్తితో తల మీద బాది చంపేశారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. నిందితురాలు తబుస్సుమ్ స్వయంగా భర్త మరణం గురించి పోలీసులు దృష్టికి తెచ్చింది. తన భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడని నటించింది. ఈ దారుణం ఎలా జరిగిందో తనకు తెలీదంటూ పోలీసులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించింది. ఇంటిని దోచుకునే క్రమంలో నిందితులు ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు తొలుత భావించారు. కానీ.. తబుస్సుమ్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో వారు సైబర్ సెల్ సహాయం తీసుకోగా మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకుని గూగుల్ హిస్టరీ ద్వారా ఒక అంచనాకి వచ్చారు. తమ స్టైల్‌లో ఇంటరాగేట్ చేయడంతో ఆమె నేరం ఒప్పుకుంది. క ఈ దారుణంపై అక్కడి టీవీ ఛానెల్స్ డిబేట్లు నడిపిస్తుండడంతో ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది.