ఐటీ కంపెనీల్లో మూన్ లైటింగ్ వివాదం పెద్ద దుమారం రేపుతోంది. వర్క్ ఫ్రం హోం పేరిట ఒకేసారి వివిధ ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ఉద్యోగులపై విప్రో కొరఢా ఝలిపించింది. ఇప్పటికే ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేస్తున్న చేస్తున్న ఐటీ ఉద్యోగులపై కొన్ని దిగ్గజ కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కోవలోనే దేశీయ ైటీ సేవల సంస్థ విప్రో తాజాగా కఠిన చర్యలు తీసుకుంది.
తాజాగా 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ విషయాన్ని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ బుధవారం స్వయంగా తెలిపారు. తమ కంపెనీలో పనిచేసే 300 మంది మూన్ లైటింగ్ పేరిట ఇతర ఉద్యోగాలు చేస్తున్నట్టు వెల్లడించారు. మూన్ లైటింగ్ విధానం కంపెనీ నిబంధనలను, పూర్తిగా ఉల్లంఘించడమే అని మరోసారి గట్టిగా వాదించారు.
ఎఐఎంఏ ఈవెంట్ లో మాట్లాడుతూ మూన్ లైటింగ్ గురించి ఇప్పటికే తీవ్రంగా విమర్శించిన ప్రేమ్ జీ అటువంటి ఉద్యోగులకు కంపెనీలో చోటు లేదని స్పష్టం చేశారు. విప్రోతో కలిసి పని చేస్తున్నప్పుడు ప్రత్యర్థుల కోసం ఏకకాలంలో నేరుగా పనిచేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
మూన్ లైటింగ్ విధానం అనైతికమని..నిబంధనలు అతిక్రమిస్తే వేటు తప్పదని ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను ఇటీవల హెచ్చరించింది. తాజా పరిణామంతో ఇప్పివరకూ లైట్ తీసుకున్న పలు ైటీ సంస్థలు ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
టెక్ ఇండస్ట్రీలో మూన్ లైటింగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. మూన్ లైటింగ్ అంటే వర్క్ ఫ్రం హోం పేరిట ఇంట్లో ఉంటున్న ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకుంటున్నారు. ఒక కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో ఏకకాలంలో రెండు పనులు చేస్తున్నారు.
ఇది మోసమని..ఉద్యోగులు అంతా కంపెనీలకు రావాలని కంపెనీలు అల్టిమేటం జారీ చేస్తున్నాయి. ఇలా మూన్ లైటింగ్ చేయడం ‘మోసం’తో సమానమని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ పేర్కొన్నాడు. దీనిపై ట్విట్టర్ లో నెటిజన్లు ఘాటుగా ఆయనకు వ్యతిరేకంగా కౌంటర్లు ఇస్తున్నారు. ‘టెక్ ఉద్యోగులు ఒకటికి మించి ఉద్యోగాలు చేయకూడదు. సరే. మరీ ప్రొఫెషనల్స్ సంగతేంటి? ఖాళీ సమయాల్లో వాళ్లేం చేస్తున్నారో పట్టించుకోరా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.