పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికవేళ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బుధవారం రాత్రి దాడి జరిగింది. ఈ దాడిలో తనకు గాయాలు కూడా అయ్యాయని దీదీ వెల్లడించారు. నందిగ్రామ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని, నలుగురైదుగురు వ్యక్తులు దూసుకొచ్చి తనను తోసేశారని మమత చెప్పారు. భద్రతా సిబ్బంది తన వెంట లేని సమయంలో ఈ దాడి జరిగిందని, దీని వెనుక కుట్ర ఉందని సీఎం ఆరోపించారు.
బుధవారమే మమత తన నామినేషన్ దాఖలు చేశారు. రెండు రోజులపాటు నందిగ్రామ్ లోనే ఉండి ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. కానీ.. ఈ దాడి జరగడంతో ఆమె పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. గాయపడిన మమతను పార్టీ శ్రేణులు హుటాహుటిన కోల్ కతాకు తరలించాయి. ఈ దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని మమత చెప్పారు.
అయితే.. బెంగాల్లో ఎన్నికల వేళ రాష్ట్ర డీజీపీ వీరేంద్రను ఎలక్షన్ కమిషన్ మంగళవారం రాత్రి ఉన్నట్టుండి బదిలీ చేసింది. ఆయన స్థానంలో పి.నీరజ్ నయన్ ను నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన రోజున ఈ దాడి జరిగిందని, సాక్షాత్తూ ముఖ్యమంత్రికే భద్రత లేకుండా పోయిందని టీఎంసీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే.. బీజేపీ మాత్రం ఇదంతా ఎన్నిక స్టంట్ అని అంటోంది. ఎన్నికల్లో ఎదుర్కోలేకనే.. ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించింది.