మాజీ సీఎంపై వాటర్ బాటిల్స్ తో దాడి

Update: 2022-06-23 13:48 GMT
అధికారం కోల్పోగానే నేతలు, కార్యకర్తలు మాట వినరు.. పైగా అధికారం పోవడానికి వాళ్లే కారణమని నిందిస్తారు. విరుచుకుపడుతారు. ఇప్పుడు తమిళనాట కూడా అదే జరుగుతోంది. పోయిన సారి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన అన్నాడీఎంకే పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పింది. ఏకంగా మాజీ సీఎంపై బాటిల్స్ తో దాడి చేసే వరకూ వెళ్లింది.

అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత చనిపోయాక ఆమె తర్వాత పార్టీ పగ్గాల కోసం పన్నీర్ సెల్వం, ఫళని స్వామి మధ్య పోరుసాగుతోంది. ఈ ఇద్దరు రెండు వర్గాలుగా చీలిపోయి వర్గపోరు రాజేస్తున్నారు. అదే ఉద్రిక్తతకు కారణమైంది.

ఫళని స్వామి ఆహ్వానం మేరకు అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి హాజరైన పన్నీర్ సెల్వంపై ఫళని స్వామి వర్గానికి చెందిన పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు ఏకంగా వాటర్ బాటిల్స్ విసిరేసి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. పరిస్థితులు దిగజారడంతో పన్నీర్ సెల్వం.. ఆయన మద్దతుదారులు సమావేశం మధ్యలోనే అర్ధాంతరంగా వెళ్లిపోయారు.

ఇక పన్నీర్ సెల్వం సూచించిన 23 తీర్మానాలు కూడా రద్దయ్యాయి. ఫళనిస్వామి వర్గంతో వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. పన్నీర్ సెల్వం ద్రోహి అని ఫళని స్వామి వర్గాలు నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. సమావేశం నుంచి పన్నీర్ వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

పార్టీలో కీలకమైన జిల్లా కార్యదర్శుల్లో 90శాతం ఫళని స్వామి వైపు చేరడంతో ఆయన చెప్పిందే వేదంగా మారింది. పన్నీర్ సెల్వంకు మరో గత్యంతరం లేని పరిస్తితి ఏర్పడింది. ఫళని గత హాయంలో ముఖ్యమంత్రి పదవిలో ఉండడంతో ఆయన మాటే చెల్లుబాటు అవుతోంది. అప్పటి నుంచే పార్టీపై పట్టు సాధించిన ఫళని తరువాత కాలంలో పగ్గాలు పంచుకునేందుకు విముఖత చూపాడు. మొత్తం 66 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ముగ్గురు మినహా అందరూ ఫళినికే సపోర్టుగా ఉన్నారు. పన్నీర్ ను అధ్యక్షుడిగా అనుకోవడం లేదు.

దీంతో పన్నీర్ మెల్లగా శశికళతో సన్నిహితంగా ఉండి ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఏక నాయకత్వం కోసం అన్నాడీఎంకేలో ఫైట్ నడుస్తోంది. కార్యదర్శి పదవి ఇచ్చి నీ వర్గానికి సరైన పదవులు ఇస్తానన్న పన్నీర్ ఒప్పుకోవడం లేదట.. దీంతో పన్నీర్ ను పార్టీ నుంచి సాగనంపేందుకు ఫళని రెడీ అయినట్టుత ెలుస్తోంది. పార్టీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడంపై ప్రధానితో చర్చించారని.. శశికళతో పన్నీర్ స్నేహాన్ని బీజేపీ పెద్దలు అంగీకరించకపోవడంతో ఫళనికే మెగ్గు పార్టీలో కనిపిస్తోంది.
Tags:    

Similar News