సమర్థింపుకు ఒక లెక్క ఉంటుంది. ఎవరేం అనుకున్నాఫర్లేదు. వెనుకాముందు చూసుకోకుండా పిడి వాదనను వినిపించటంలో వైసీపీ వర్గాలకు ఉన్న టాలెంట్ మరెవరికీ ఉండదన్న మాట వినిపిస్తోంది. తమ వాళ్లు ఏం చేసినా? ఎలా చేసినా.. అంతకు మించిన న్యాయం ఇంకేం ఉంటుందన్న రీతిలో వారి కవరింగ్ ఉంటుందంటున్నారు. వారి మాటలు చూసినప్పుడు.. అత్తారింటికి దారేది సినిమాలో.. నదియా పాత్రను కూర్చోబెట్టి.. మైండ్ గేమ్ లో భాగంగా మాటలతో టార్చర్ చేస్తూ.. విలువైన హోటల్ ను కొట్టేయటం కోసం ఎలా ప్లాన్ చేస్తారో చూసిందే. ఆ సందర్భంగా తప్పుడు డీల్ చేసే వాడిలో ఒకడు (థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పాత్రధారి) ఇంతటి న్యాయమైన డీల్ నా జీవితంలో చూడలేదమ్మా? అనటం చూస్తాం.
సరిగ్గా.. ఇలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారన్న విమర్శను ఎదుర్కొంటున్నారు వైసీపీకి చెందిన మద్దతుదారులు. ఇంతకూ విషయం ఏమంటే.. మంత్రి జోగి రమేశ్ తీరును తప్పు పడుతూ.. ఆయన చేస్తున్న పనులపై విమర్శలు సంధిస్తూ జనసేనకు చెందిన యడ్లపల్లి రామ్ సుధీర్ పోస్టర్లను సిద్ధం చేశారు. అందులో ఉన్న విమర్శ ఏమంటే.. ప్రచారార్భాటం.. పని శూన్యం.. అవినీతి ఘనం అంటూ మంత్రిగారి తీరును తప్పు పడుతూ పోస్టర్లను సిద్ధం చేశారు. వాటిని అతికిస్తున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన జోగి రమేశ్ అనుచరులు వారిపై దాడి చేశారు.
ఈ దాడిని తీవ్రంగా ఖండించింది జనసేన. అంతేకాదు.. జనసేనకు చెందిన వారు పెద్ద ఎత్తున రావటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోస్టర్లు అతికిస్తే మాత్రం ఇలా దాడులు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. దీనికి వైసీపీ బ్యాచ్ వాదన పరమ విచిత్రంగా.. వింతగా ఉండటమే కాదు తొండిగా ఉందన్న విమర్శ వినిపిస్తోంది. పోస్టర్లు అతికిస్తే ఊరుకుంటారా? విమర్శలు చేస్తారా? అర్థరాత్రి వేళ పోస్టర్లు అతికిస్తారా? లాంటి పస లేని ప్రశ్నల్ని సంధిస్తున్నారు.
మంత్రి జోగిరమేశ్ పని తీరును తప్పు పడుతూ పోస్టర్లు ముద్రించకూడదన్న రూల్ ఎక్కడా లేదు. ఒకవేళ.. అందులోని విషయాలు కూడా చట్ట వ్యతిరేకంగా ఉన్న అంశాలేమీ కావు. అన్నింటికి మించి.. సదరు పోస్టర్లు ఎవరు ముద్రించారు? అన్న వివరాలు ఉన్నప్పుడు.. ఇక అందులో సమస్య ఏముంది? ఒకవేళ పోస్టర్ లోని అంశాలు సరిగా లేవు.. చట్టవ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తే.. కేసులు నమోదు చేయొచ్చు. చట్టబద్ధంగా శిక్షలు పడేలా చేయొచ్చు.
అంతేకాని.. చట్టవిరుద్ధంగా.. బరితెగింపు ధోరణితో దాడులు చేయటం ఏమిటి? అన్నది ప్రశ్న. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జోగి రమేశ్ ఘాటు విమర్శలు చేయటం కామన్ అని.. అదేమీ తప్పు కాదన్నట్లుగా మాట్లాడుతున్న వైనం చూస్తే.. బరితెగింపునకు బ్రాండ్ అంబాసిడర్లుగా వైసీపీ మద్దతుదారులు మారారా? అన్న సందేహం కలుగక మానదు. ఎంత వైసీపీ నేత అయితే.. ఎంత మంత్రి అయితే.. ఎంత జోగి రమేశ్ అయితే మాత్రం పవన్ కల్యాణ్ ను నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తారా? అలా మాట్లాడితే లేని తప్పు,.. మంత్రి వైఫల్యాల మీద పోస్టర్ (అది కూడా ఫలానా వ్యక్తి పోస్టు వేస్తున్న విషయాన్ని పేర్కొన్నారే తప్పించి.. ఆకాశ రామన్న పేరుతో పోస్టర్ ప్రింట్ చేయలేదు) వేయటం చట్ట విరుద్ధం కాదు కదా?
ఒకవేళ చట్టవిరుద్ధంగా చేసినట్లయితే.. అందుకు తగ్గ చర్యలు తీసుకుంటే.. ఏ సమస్యా ఉండదు కదా? అంతే కానీ.. భౌతిక దాడులు చేయటం ఏమిటి? వైసీపీ మద్దతుదారులకు సోషల్ పోలీసింగ్ చేయొచ్చని.. తమకు నచ్చిన వారిని తన్నేయొచ్చన్న రూల్ ఏమైనా తీసుకొచ్చారా? తమ వారికి దన్నుగా నిలిచేందుకు వాదనలు వినిపించటం తప్పు కాదు. కానీ.. నోటికి వచ్చినట్లుగా.. అడ్డగోలుగా మాట్లాడితేనే సమస్యంతా? అన్నది స్వయం ప్రకటిత మేధావులకు పట్టకపోవటం ఏమిటో?
ప్రపంచం సంగతి పక్కన పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా.. ఎక్కడైనా.. పోస్టర్లు అతికించటం అన్నది రాత్రి వేళ చేస్తారే తప్పించి.. పగలు పూట చేయరు. ఈ చిన్న విషయాన్ని సైతం వదిలేసి.. అర్థరాత్రి దొంగచాటుగా పోస్టర్లు అతికాస్తున్నారన్న ప్రచారం చూస్తే.. నవ్వు రాక మానదు. నిజంగానే దొంగచాటుగా పోస్టర్లు అతికించే వారు.. ఆ పోస్టర్లు ఫలానా జనసేన నాయకుడివి అన్న విషయం తెలిసేలా పోస్టర్లో పేర్లు వేయరు కదా? ఇలాంటి పస లేని.. పనికిమాలిన వాదనను వినిపిస్తూ.. చట్టవిరుద్ధంగా దాడులు చేయటాన్ని కూడా సమర్థించుకుంటే.. అతి తెగింపుగా కాకుండా బరితెగింపుగా మారి.. చూసే వారికి వెగటుగా మారుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి అతి కారణంగా.. వారికి జరిగే నష్టం కంటే కూడా.. తాము అమితంగా అభిమానించి.. ఆరాధించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ దెబ్బ తింటుందన్న చిన్న విషయాన్ని మర్చిపోవటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.