తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ పిల్లల భవిష్యత్ బాగుండాలనే కోరుకుంటారు. ఇందులో భాగంగా కొన్ని సమయాల్లో పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి రావొచ్చు. అది కూడా పిల్లల భవిష్యత్ బాగుండాలనే ఆరాటం తప్ప వారిలో మరో దురుద్దేశ్యం ఉండదు. అయితే కొందరు పిల్లలు మాత్రం తల్లిదండ్రుల ప్రేమను అపార్థం చేసుకుంటున్నారు.
ఇంటి దగ్గర ఉంటే గారాబంతో పిల్లలు ఎక్కడ చెడిపోతారోనని కొందరు తల్లిదండ్రులు హాస్టల్లో ఉంచి చదివిస్తుంటారు. ఈక్రమంలోనే కొందరు పిల్లలు తమ పేరెంట్స్ కు తమపై ప్రేమలేకనే హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారని.. తెలిసి తెలియని వయస్సులో ఊహించుకుంటున్నారు. ఈ సంఘటన వారి మనస్సులో బలంగా నాటుకుపోయి ఆ తర్వాత రోజుల్లో తల్లిదండ్రులపై కక్ష దారితీస్తోంది.
బ్రిటన్లో తాజాగా ఇలాంటి సంఘటనే వెలుగుచూసింది. చెషైర్ ప్రాంతానికి చెందిన ఎడ్ లిన్స్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం తన తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు అతడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎడ్ లిన్స్ చెప్పిన కారణం విని పోలీసులు సైతం విస్తుపోయారు.
తన తల్లిదండ్రులు 40 ఏళ్ళ క్రితం తనను హాస్టల్ లో వేయడం వల్ల అనేక బాధలు పడ్డానని తెలిపాడు. ఇందుకు తన పేరెంట్స్ ను ఆర్థికంగా పరిహారం కోరినట్లు చెప్పాడు. దీంతో తన తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్న ఇంటిని అమ్మి సగం వాటా తనకు.. మిగతా సగం వాటా తన తమ్ముడికి ఇచ్చేందుకు నిర్ణయించారని తెలిపారు.
అయితే మొత్తం వాటాకు తనకే ఇవ్వాలని కోరగా వారు నిరాకరించడంతోనే వారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు పోలీసుల విచారణలో ఎడ్ లిన్సే ఒప్పుకున్నాడు. లిన్సే దాడిలో గాయపడిన తల్లిదండ్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారని పోలీసులు తెలిపారు.
కాగా లిన్సే తమపై దాడి చేసినప్పటికీ తల్లిదండ్రులు మాత్రం అతడిని క్షమించి వదిలేయాలనని కన్నప్రేమను చాటుకున్నారు. లిన్సే మానసిక పరిస్థితి లేదని అందువల్లే తమపై దాడి చేశాడని.. అతడిపై చర్యలు తీసుకోవద్దంటూ కోర్టును విన్నవించుకున్నారు. ఏది ఏమైనా ఎప్పుడో చిన్నతనంలో జరిగిన ఘటనను మనస్సులో పెట్టుకొని పెద్దయ్యాక తల్లిదండ్రులపై దాడికి దిగడం శోచనీయంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.