చిత్తూరు జిల్లాలో మరో రాజకీయ కలకలం రేగింది. టీడీపీ నేత - మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై సుగుణమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక పరిశీలనలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై మందు బాటిల్స్ తో దాడి చేసినట్టు అక్కడి పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఈ దాడిలో సుగుణమ్మ ఇంటి అద్దాలు పగిలిపోయాయి.
మూడు రోజుల క్రితం తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీ నిర్వహించారు. అందులో పాల్గొనడానికి టీడీపీ నేత అయిన సుగుణమ్మ బయలుదేరగా పోలీసులు హౌస్ అరెస్టు అయ్యారు. తర్వాత మూడు రోజులకు ఈ సంఘటన జరిగింది. అయితే, ఈ దాడి ఆకతాయిల పనా? దీని వెనుక ఉన్నది ఎవరూ అన్నది అర్థం కావడం లేదు. పోలీసులు దీనిపై ఇతర వివరాలు ఏవీ వెల్లడించలేదు. దర్యాప్తు జరుగుతోంది.